Acne, Scars : మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మాన్ని కోరుకుంటున్నారా.. అయితే ఈ సోప్ మీ కోసమే!

మొటిమలు, మచ్చలు( Acne, Scars ) లేకుండా చర్మం మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అటువంటి చర్మాన్ని పొందడం కోసం క్రీమ్, సీరం తదితర ఉత్పత్తుల్ని వాడుతుంటారు.నెలకు ఒక్కసారైనా బ్యూటీ పార్లర్ కు వెళ్తూ ఫేషియల్, బ్లీచ్, టాన్ రిమూవింగ్ వంటివన్నీ చేయించుకుంటూ ఉంటారు.

అయితే వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అన్నది పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సోప్( Homemade Soap ) మాత్రం మీ చర్మాన్ని అందంగా మెరిపిస్తుంది.

మొటిమలను, మచ్చలను మాయం చేస్తుంది.క్లియర్ స్కిన్ మీ సొంతం అయ్యేలా చేస్తుంది.

మరి ఇంతకీ ఆ సోప్ ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం ప‌దండి.

"""/" / ముందుగా ఒక సోప్ బేస్ ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కల‌ను ఒక బౌల్ లో వేసి డబుల్ బాయిలర్ మెథడ్ లో మెల్ట్ చేసుకోవాలి.

సోప్‌ బేస్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ మునగాకు పౌడర్( Munagaku Powder ), వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సూప్ మోల్డ్‌ లో వేసి మూడు నాలుగు గంటల పాటు వదిలేయాలి.

దాంతో మన న్యాచురల్ మొరింగా సోప్ సిద్ధం అవుతుంది.రోజు బాత్ కి ఈ హోమ్ మేడ్ సోప్ ను వాడితే అనేక స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

ఈ సోప్ మొటిమలు మరియు మచ్చలను క్రమంగా మాయం చేస్తుంది.స్కిన్ ను క్లియ‌ర్ గా మారుస్తుంది.

అలాగే ఈ మొరింగా సోప్ ను వాడటం వల్ల చర్మం గ్లోయింగ్ గా తయారవుతుంది.

షైనీ గా మెరుస్తుంది.డ్రై స్కిన్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ సోప్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ సోప్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.మరియు మృదువుగా కోమలంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

ఆరోగ్యానికి వరం రావి ఆకులు.. వీటితో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా?