ఈ హెయిర్ స్ప్రే వాడితే జుట్టు రాలే స‌మ‌స్య‌కు బై బై చెప్పొచ్చు!

హెయిర్ ఫాల్‌.ఇటీవ‌ల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో తీవ్రంగా మ‌ద‌న పెడుతున్న స‌మ‌స్య ఇది.

అందులోనూ కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ప‌ని చేసే వారు విప‌రీత‌మైన హెయిర్ ఫాల్‌ను ఫేస్ చేస్తుంటారు.

అలాగే పోష‌కాల కొర‌త‌, రెగ్యుల‌ర్‌గా త‌ల‌స్నానం చేయ‌డం, త‌డి జుట్టును దువ్వ‌డం, త‌డి జుట్టును జ‌డ వేసుకోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం కోసం ఎన్నెన్నో ఆయిల్స్ వాడ‌తారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నీ పాటిస్తారు.

అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే మందులు కూడా వాడ‌తారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ స్ప్రేను వారానికి రెండు సార్లు ట్రై చేస్తే జుట్టు రాలే స‌మ‌స్య‌కు బై బై చెప్పొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హెయిర్ స్ప్రేను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల క‌లోంజి సీడ్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ బ్రైన్ రైస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతుల పొడి, గుప్పెడు క‌రివేపాకు ఆకులు వేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.

"""/" / బాగా మ‌రిగిన త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని స్ట్రైన‌ర్ సాయంతో వాట‌ర్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాట‌ర్‌ను పూర్తిగా చ‌ల్లార‌బెట్టుకుని.అందులో వ‌న్ టేబుల్ స్పూన్ అర్గన్ ఆయిల్ లేదా కొక‌న‌ట్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ వాటర్‌ను స్ప్రే బాటిల్ లో నింపి.జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల‌కు స్ప్రే చేసుకోవాలి.

రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాల్‌ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

నేడు కేసీఆర్ బస్సు యాత్ర .. ఎక్కడ జరగబోతోందంటే ..?