అమెరికా : డబ్బులిచ్చినా కనికరించని వైనం.. దోపిడి దొంగ తూటాకు భారతీయ యువకుడు బలి
TeluguStop.com
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది.దోపిడి దొంగ కాల్పుల్లో ఓ భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.జార్జియా రాష్ట్రంలో పరమ్‌వీర్ సింగ్ అనే భారత సంతతి యువకుడు గత కొంతకాలంగా స్టోర్ నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ఓ దుండగుడు ఆ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి తుపాకీతో పరమ్‌వీర్‌ను బెదిరించాడు.
దీంతో భయాందోళనకు గురైన బాధితుడు వెంటనే కౌంటర్‌లో వున్న డబ్బును ఇచ్చేసి, ఓ మూలన కూర్చొన్నాడు.
కానీ ఏమాత్రం కనికరించని దుండగుడు పరమ్ వీర్‌పై వెనుక నుంచి కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అంతేకాదు దుండగుడు వెళ్తూ వెళ్తూ క్యాష్ కౌంటర్ వద్ద వున్న కంప్యూటర్, ఇతర పరికరాలను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు.
నిందితుడిని క్రిస్ కోప్‌ల్యాం డ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఇక మృతుడు పరమ్ వీర్ సింగ్ స్వస్థలం భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం థాపై గ్రామం.
అతని మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. """/"/
ఇకపోతే.
అమెరికాలో ఇటీవలి కాలంలో పెరుగుతున్న విద్వేషదాడులు, గాంధీ విగ్రహం ధ్వంసం తదితర ఘటనలకు వ్యతిరేకంగా న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద భారతీయులు శాంతియుతంగా నిరసన తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ (ఎఫ్ఐఏ)తో పాటు ఇతర కమ్యూనిటీ సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి.
బైడెన్ పరిపాలనా యంత్రాంగం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
క్షతగాత్రులందరినీ సురక్షితంగా వుంచేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు నిరసనకారులు.
ఓరి దేవుడా.. కళ్ళు సీసాలో ప్రత్యక్షమైన కట్లపాము