తగ్గేదేలే.. యూఎస్ లో ఇంకా ఊపేస్తున్న 'ఊ అంటావా మావా'..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప.

ఈ సినిమాలో ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంది.ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఎక్కడ విన్న పుష్ప సాంగ్స్ నే వినిపిస్తున్నాయి.

ఏ ఇండస్ట్రీ చూసిన పుష్ప మ్యానియానే నడుస్తుంది.ఇక ''ఊ అంటావా.

ఊఊ అంటావా మామ'' సాంగ్ ఈ సినిమాకే హైలెట్.పుష్ప సినిమాలో ఈ పాటకు స్టార్ హీరోయిన్ సమంత ఆడిపాడిన విషయం తెలిసిందే.

ఈమె ఈ పాటతో సౌత్ ఇండియన్ కాదు నార్త్ ఇండియాను కూడా ఊపేసింది.

ఈ పాటకు సోషల్ మీడియాలో కొన్ని వందల మంది డ్యాన్స్ స్టెప్పులు వేసి వీడియోలు పోస్ట్ చేసారు.

ఈ వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజెన్స్ ను అలరించాయి.

ఈ పాట వచ్చి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా ఊపు తగ్గలేదు.ఈ పాటకు సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు అందరు స్టెప్పులు వేసి అదరగొట్టారు.

"""/" / దీనికి సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసాయి.

ఇక తాజాగా యుఎస్ఏ లో ఒక 13 ఏళ్ల చిన్నారి ఈ పాటకు వయోలిన్ వాయిస్తూ కాలిఫోర్నియా వీధుల్లో సందడి వాతావరణం తీసుకు వచ్చింది.

"""/" / కరోలినా అనే అమ్మాయి ఈ సాంగ్ కు అద్బుతమైన వయోలిన్ కవర్ సాంగ్ చేసి అందరిని ఆకర్షించింది.

దీనికి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.ఇలా పుష్ప పాటలు ఇప్పటికి వరల్డ్ వైడ్ గా అలరిస్తూనే ఉన్నాయి.

ఎవరో ఒకరు ఇలాంటి ఆసక్తికర వీడియోలను చేస్తూ అలరిస్తూనే ఉన్నారు.యుఎస్ లో ఉన్న అమ్మాయి సైతం ఇలా ప్లే చేస్తుంది అంటే మన పుష్ప క్రేజ్ ఏ మాత్రం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదేందయ్యా ఇది.. పైకి పాకుతున్న నది నీరు.. వీడియో చూస్తే నమ్మలేరు..