ట్రాఫిక్‌ పోలీసులపైనే తుపాకీ గురిపెట్టిన యూఎస్ మహిళ.. ఆమెను ఎలా పట్టుకున్నారో చూస్తే…

అమెరికాలో సామాన్య ప్రజల చేతుల్లో కూడా తుపాకీలు( Guns ) ఉంటుంటాయి.వీటిని వారు దుర్వినియోగం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలను చంపేసిన సంఘటనలు ఎన్నో.

ఈ దేశంలో ఎప్పుడు ఎవరు గన్ చేత పట్టుకొని ఎవర్ని కాల్చి చంపుతారో చెప్పలేని పరిస్థితి.

తాజాగా ఒక మహిళ ఏకంగా ట్రాఫిక్ పోలీసులకే తుపాకీ గురి పెట్టింది.ఆమె ఒక బిజీ రోడ్‌ మధ్యలోకి వచ్చి తుపాకీ పట్టుకొని బీభత్సం సృష్టించింది.

అయితే ఎవరి ప్రాణాలను ఆమె తీయకముందే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ఒక కారుతో ఆమెను బలంగా ఢీకొట్టారు.

అనంతరం అక్కడే ఉన్న మిగతా పోలీస్ అధికారులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను నేలపై పడుకోబెట్టి చేతికి సంకెళ్లు వేశారు.

"""/"/ మొత్తం సంఘటనకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన చాలా మంది ఆమెను అదుపులోకి తీసుకున్న లాంగ్ ఐలాండ్ పోలీసులను ప్రశంసిస్తున్నారు.

వైరల్ వీడియో( Viral Video _ ఓపెన్ చేస్తే మనకు ఓ యూఎస్‌ మహిళ మార్గంమధ్యలో వెనుకకు నడుస్తూ తుపాకీతో వాహనదారులకు గురిపెట్టడం చూడవచ్చు.

47 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ఆమె తన తలకే గురిపెట్టుకుంది.దానికంటే ముందు ఒక కూడలిలో ఆమె తుపాకీని గాలిలోకి కాల్చింది.

అనంతరం ట్రాఫిక్ పోలీసులకు కారు వైపు గన్ గురి పెట్టింది.దాంతో వెంటనే ఒక పోలీసు కారు ఆమెను బలంగా ఢీకొట్టి కింద పడేసింది.

"""/"/ అదే అదునుగా భావించిన మిగతా పోలీసులు ఆమె వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు.

ఈ సమయంలో "గన్ డ్రాప్!" అని గట్టిగా అరిచారు.కారు గుద్దుకోవడం వల్ల ఆమె త్వరగా లేవలేకపోయింది.

దాంతో ఇద్దరు అధికారులు ఆమె వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకోగలిగారు.లోకల్ మీడియా ప్రకారం, ఈ కలవర పెట్టే ఘటన మంగళవారం మధ్యాహ్నం నస్సౌ కౌంటీ( Nassau County )లో చోటు చేసుకుంది.

సదరు మహిళ నార్త్ బెల్‌మోర్‌లోని బెల్‌మోర్, జెరూసలేం అవెన్యూల కూడలిలో తుపాకీతో హల్చల్ చేసింది.

గాలిలో ఒకసారి తుపాకీని పేల్చి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.ఈ 33 ఏళ్ల మహిళ కారు ఢీ కొట్టడం వల్ల స్వల్పంగా గాయపడింది.

చికిత్స మేరకు ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.ఆమె పేరును వారు బయటపెట్టలేదు.

ఆమె ఇలాంటి పని ఎందుకు చేసిందో ఆరా తీస్తున్నారు.

జుట్టును దృఢపరిచే దాల్చిన చెక్క.. ఎలా వాడాలంటే?