వేసుకుంది హైహీల్స్‌... చేసింది విన్యాసం ? ఆ మ‌హిళ‌ను చూస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే !

మ‌హిళ‌లు అలంకార‌ప్రాయంలో హైహీల్స్ ఒక‌టి.ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారు వీటికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుంటారు.

ఇవి వారిని ఆక‌ట్టుకునేల చేస్తాయి.అందుకే చాలామంది మ‌హిళ‌లు, యువ‌తులు హై హీల్స్ ధ‌రించ‌డానికి మ‌క్కువ చూపుతుంటారు.

మ‌రికొంద‌రు స్టైల్ కోస‌మ‌ని, మ‌రికొంద‌రు అందంగా క‌నిపించాల‌ని ధ‌రిస్తుంటారు.ఒక్కోసారి హైహీల్స్ వేసుకుంటే న‌డిచేట‌ప్పుడు బ్యాలెన్స్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంది.

అప్పుడ‌ప్పుడు ప్ర‌మాదాన్ని కూడా కొనితెచ్చిపెడుతుంది.అదే జ‌రిగితే న‌వ్వుల‌పాలు కావాల్సిందే.

అయితే ఓ మ‌హిళ హైహీల్స్ వేసుకుని మ‌రీ విన్యాసం చేసింది.ఈ వీడియో సోష‌ల్ మీడియాలో అంద‌రిని అక‌ట్టుకుంటోంది.

మ‌హిళ‌ల‌కు సంబంధించిన ఏ విష‌య‌మైనా, ముఖ్యంగా వారి అలంకార ప్రాయానికి సంబంధించిన‌వే కాకుండా వారి ప్ర‌తిభ‌ను వెలికి తీసే వీడ‌యోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

మ‌న‌మూ ఓ సారి ఈ వీడియో చూద్దామా.ఈ వీడియోలో స‌ద‌రు మ‌హిళ హైహీల్స్ వేసుకుని ఓతాడు మీద నుంచి జంపింగ్ చేసింది.

అంతేకాదండోయ్ త‌న విన్యాసంతో ఏకంగా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.

దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.ఎంతో నైపుణ్యం, మెల‌కువ‌లు ఉంటే త‌ప్ప ఇది సాధ్యం కాదంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆమె సాహ‌సానికి, ధైర్యానికి హ్యాట్సాప్ అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/02/us-woman-placed-in-guinness-world-records-doing-stunt-by-Wearing-high-heels‌-detailss!--jpg "/ అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మ‌హిళ ఓగ్లీ హెన్రీ అథ్లెటిక్‌.

సాంటా మోనికా బీచ్‌లో తాడుపై జంపింగ్ చేసే స్టంట్‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రినీ ఔరా .

? అనిపించేసింది.దీంతో ఆమె ఈ రికార్డును సొంతం చేసుకుంది.

స‌ద‌రు మ‌హిళా విన్యాసానికి, నైపుణ్యాల‌కు గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ప్ర‌తినిధులు మంత్ర‌ముగ్ధుల‌య్యారు.త‌న విన్యాసాల‌ను ఆమె అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది.

నెటిజ‌న్లు ఆమె ప్ర‌తిభ‌ను చూసి తెగ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.ఆ స్టంట్ వీడియోను మీరూ చూసేయండి.

తాగునీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు సఫలం..: మంత్రి ఉత్తమ్