ఇండియన్స్‌, అమెరికన్స్ ఆహారపు అలవాట్లు ఎంత భిన్నంగా ఉంటాయో తెలుసా..?

భారతదేశానికి వచ్చి సెటిల్ అవుతున్న విదేశీయుల సంఖ్య బాగా పెరుగుతోంది.ముఖ్యంగా అమెరికా నుంచి ఇండియాకి చాలామంది తరలివస్తున్నారు.

వారిలో క్రిస్టెన్( Kristen ) ఒకరు.తాజాగా ఆమె తన అనుభవాలు పంచుకున్నారు.

ఆమె మన సంస్కృతి చాలా ఆసక్తికరంగా ఉందని భావిస్తున్నారు.ముఖ్యంగా ఆహారం విషయంలో( Food ) చాలా తేడాలు ఉన్నాయని చెప్పారు.

అమెరికాలో ఉప్పు, మిరియాలతోనే వంట చేస్తారు.కానీ భారతదేశంలో ( India ) అనేక రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు.

అమ్చూర్, ధనియాల పొడి, పసుపు, మిరపకాయ పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, నల్ల మిరియాలు లాంటి చాలా ఇంగ్రిడియంట్స్ ఇండియన్ ఫుడ్స్ లో మిక్స్ చేస్తారని ఆమె ఆశ్చర్యపోతూ తెలిపారు.

ఈ విషయాలను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, భారతీయ సంస్కృతి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు.

"""/" / ఆమె ఓ వీడియో పోస్ట్ చేసి మరీ ఇండియన్, అమెరికన్స్ ఆహారపు అలవాట్ల మధ్య ఉన్న తేడాలను తెలియజేశారు.

ఆమె చెప్పిన ప్రకారం, అమెరికాలో( America ) సాయంత్రం 5 గంటలకే భోజనం చేయడం ఆరంభిస్తారు.

కానీ భారతదేశంలో రాత్రి 10 గంటలకు భోజనం చేయడం చాలా సర్వసాధారణం.అలాగే, అమెరికాలో పెద్ద పెద్ద కప్పుల్లో కాఫీ( Coffee ) తాగుతారు.

కానీ ఇక్కడ చిన్న చిన్న కప్పుల్లో చాయ్ తాగుతూ ఆ రుచిని ఆస్వాదిస్తారు.

అంతేకాకుండా, అమెరికాలో ఫోర్క్ తో భోజనం చేస్తారు.కానీ ఇక్కడ చేతులతో భోజనం చేయడం చాలా సహజమైన విషయం.

"""/" / క్రిస్టెన్ వీడియో చాలా మందికి నచ్చింది.చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్లలో పెట్టారు.

ఒకరు, "అమెరికాలో చల్లని కాఫీ తాగుతారు.ఇండియాలో వేడి కాఫీ.

అమెరికాలో స్టార్‌బక్స్‌లో చాయ్ లాటే తాగుతారు.ఇండియాలో నేరుగా చాయ్ తాగుతారు" అని రాశారు.

మరొకరు, "అమెరికాలో సాయంత్రం త్వరగా భోజనం చేయడం మంచిది.ఇండియాలో కూడా ఒకప్పుడు అలాగే ఉండేది.

కానీ ఇండస్ట్రీల వల్ల భోజనం చేసే సమయం ఆలస్యమైంది.ఇది పిల్లలకు మంచిది కాదు" అని రాశారు.

మరొకరు, "మా అమ్మ ఇండియా నుంచి చాలా చిన్న చిన్న కప్పులు తెస్తుంది.

ఆమెకు ఆ కప్పుల సైజు చాలా నచ్చుతుంది" అని రాశారు.మరొకరు క్రిస్టెన్‌తో "చాలా బాగుంది! ఇప్పుడు నీకు ఏది ఎక్కువ ఇష్టం? ఇండియన్ సిటిజన్‌షిప్ తీసుకోవడానికి రెడీయా?" అని జోక్ చేశారు.

మరికొందరు "నీవు చాలా మంది భారతీయుల కంటే స్వచ్ఛమైన భారతీయురాలిలా ఉన్నావు" అని కూడా రాశారు.

వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.. హీరోయిన్ సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!