ఏందిది.. లగ్జరీ బ్యాగులు పక్కన పెట్టేసి.. బాస్మతి బియ్యం సంచులను వాడుతున్న అమెరికన్లు..
TeluguStop.com
లగ్జరీ హ్యాండ్‌బ్యాగులకు బైబై చెప్పే టైమ్ వచ్చేసిందా? అంటే పాజిటివ్ గానే ఆన్సర్ వినిపిస్తోంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వింత ట్రెండ్ వైరల్ అవుతోంది.అదేంటంటే, బాస్మతి బియ్యం బస్తాలతో( Basmati Rice Bag ) చేసిన బ్యాగులు! అవును, మీరు విన్నది నిజమే.
ఇప్పుడు ఇది ఒక రకంగా ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారింది.అమెరికాలో ఒక మహిళ బాస్మతి బియ్యం బస్తాతో చేసిన టోట్ బ్యాగ్‌తో( Tote Bag ) కనిపించడంతో ఈ ట్రెండ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వీడియో తీసిన వ్యక్తి మొదట ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు వాడుతున్న వారిని చూపిస్తూ, ఆ తర్వాత కెమెరాను వెనక్కి తిప్పగా ఒక మహిళ బాస్మతి బియ్యం బస్తాతో చేసిన బ్యాగ్‌తో కనిపించింది.
దాంతో వీడియో తీసిన వ్యక్తి ఆశ్చర్యపోతూ, డిజైనర్ బ్యాగుల హవా నడుస్తున్న ఈ రోజుల్లో ఇలా బియ్యం బస్తాతో చేసిన బ్యాగ్ వాడటం చాలా కొత్తగా ఉందని కామెంట్ చేశారు.
అంతేకాదు, ఈ బ్యాగులు ఇండియాలో చాలా చౌకగా దొరుకుతాయని, ఎవరైనా కావాలనుకుంటే సులభంగా తెప్పించుకోవచ్చని కూడా చెప్పారు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. """/" /
సాధారణంగా ఎవరైనా ఖరీదైన బ్యాగులు కొని తమ స్టేటస్ చూపించుకోవాలని అనుకుంటారు.
కానీ ఈ బియ్యం బస్తా బ్యాగ్ మాత్రం దానికి పూర్తి విరుద్ధం.ఇది సింప్లిసిటీకి, ప్రాక్టికాలిటీకి, ఇంకా సస్టెయినబిలిటీకి ఒక చిహ్నంగా నిలుస్తోంది.
అందుకే ఇది సోషల్ మీడియాలో అంతలా ఆదరణ పొందుతోంది. """/" /
బియ్యం బస్తా బ్యాగ్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
8 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
విమల్ బ్యాగ్‌తో( Vimal Bag ) పోలుస్తూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఈ అమెరికన్ మహిళ బియ్యం బస్తా ట్రెండ్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చిందని అంటున్నారు.
అదే సమయంలో, సాధారణ బియ్యం బస్తా బ్యాగులు వైరల్ ట్రెండ్‌గా( Viral Trend ) మారడం ఫ్యాషన్ విచిత్రాలకు నిదర్శనం.
కొన్నిసార్లు అతి సామాన్యమైన వస్తువులే ట్రెండ్‌సెట్టర్లుగా నిలుస్తాయని, ఫ్యాషన్ అనేది కేవలం ఖరీదైన వస్తువుల్లోనే కాదని ఈ వీడియో తెలియజేస్తోంది.
సింప్లిసిటీ కూడా ఒక గొప్ప ఫ్యాషన్ అని చాటి చెబుతోంది.https://www!--instagram!--com/reel/DDlnUpSxtb8/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ఈ లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు.
ఓట్స్ ఆరోగ్యకరమే.. కానీ వారు తినకపోవడమే బెటర్..!