యూఎస్ మహిళకు టోపీ.. రూ.300 ఫేక్ జ్యువలరీని రూ.6 కోట్లకు అమ్మారు..??

ఈ ప్రపంచంలో ఎంతోమంది మోసగాళ్లు ఉన్నారు.అమాయకులు దొరకాలే గానీ వారిని నిండా ముంచేసే కేటుగాళ్లు వీధి వీధినా కనిపిస్తారు.

అయితే ఇండియాలో ఇలాంటి ఒక మోసం వెలుగు చూసింది.అమెరికా నుంచి వచ్చిన చెరిష్( Cherish ) అనే మహిళా.

జైపూర్‌లో( Jaipur ) 6 కోట్ల రూపాయల (సుమారు 8 లక్షల డాలర్లు) విలువైన నగలు అనుకుని ఓ జ్యువలరీని కొనుక్కుంది.

కానీ అవి నకిలీ నగలు అని, వాటి విలువ కేవలం 300 రూపాయలే (సుమారు 4 డాలర్లు) అని తరువాత తెలిసింది.

దాదాపు రెండు సంవత్సరాల క్రితం గోపాల్జీ కా రాస్తాలో ఉన్న ఓ దుకాణం నుంచి ఆమె ఈ నగలు కొనుక్కుంది.

ఆ దుకాణం యజమాని ఆ నగలు ప్యూర్ అని చెప్తూ ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు.

అమెరికా( America ) వెళ్ళాక, ఆ నగలను ఎగ్జిబిషన్ లో చూపించగా, అవి నకిలీవని చెరిష్ గుర్తించింది.

వెంటనే జైపూర్‌కు తిరిగి వచ్చి, ఇప్పుడు రామ రేడియం( Rama Radium ) అనే పేరుతో ఉన్న ఆ దుకాణానికి వెళ్ళి, షాపు యజమాని గౌరవ్ సోనికి( Gaurav Soni ) నగలు నకిలీవని చెప్పింది.

ఇతర దుకాణాల్లో కూడా నగలు నిజమైనవి కాదని పరీక్షించుకుంది.చివరిగా, జరిగిన విషయం యు.

ఎస్.ఎంబసీకి తెలియజేసింది.

"""/" / పోలీసులు ఈ కేసును పరిశీలించి, నగలను పరీక్షించారు, ఆపై ఖరీదైన వజ్రాలని చెప్పినవి నిజానికి మూన్‌స్టోన్లు (చంద్రకాంతులు) అని, బంగారం కూడా చెప్పినంత మంచిది కాదని తేల్చారు.

దుకాణ యజమాని గౌరవ్ సోని, అతని తండ్రి రాజేంద్ర సోని( Rajendra Soni ) కూడా చెరిష్ వారి దుకాణం నుంచి నగలు దొంగిలించిందని ఫిర్యాదు చేశారు, కానీ పోలీసులు దుకాణానికి ఉన్న సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి, అది నిజం కాదని గుర్తించారు.

"""/" / నకిలీ వాటికి ప్యూర్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఇచ్చిన నందకిషోర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పుడు దాక్కున్న గౌరవ్ సోని కోసం గాలిస్తున్నారు.చెరిష్ ఫిర్యాదు తరువాత, గౌరవ్ సోని, రాజేంద్ర సోనిపై ఇలాంటి మోసాలకు సంబంధించి మరిన్ని ఫిర్యాదులు పోలీసులకు అందాయి.

వాటిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.గౌరవ్ సోని, అతని తండ్రి తనకు చాలా కాలంగా నకిలీ ధృవీకరణ పత్రాలతో, తక్కువ నాణ్యత గల బంగారం, నకిలీ వజ్రాలను పంపిస్తున్నారని చెరిష్ తన అనుభవాన్ని పంచుకుంది.

తాను మాత్రమే బాధితురాలు కాదని, దాదాపు పది మంది ఇతర నగల డిజైనర్లు కూడా వారి చేతిలో మోసపోయారని ఆమె చెప్పింది.

నిందితులను పట్టుకోవడానికి, ఇలాంటి మోసాల నుంచి ఇతరులను కాపాడేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కల్కి మూవీలో కృష్ణుడి రోల్ ను చరణ్, ఎన్టీఆర్ మిస్ చేసుకున్నారా.. అసలు నిజాలివే!