48 గంటల్లో మరో రెండు చోట్ల కాల్పులు... ముగ్గురి మృతి, వణుకుతున్న అమెరికా
TeluguStop.com
అమెరికాలోని న్యూయార్క్‌లోని బఫెలో వున్న టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో పది మంది మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన మరిచిపోకముందే 48 గంటల వ్యవధిలో మరో రెండు చోట్ల కాల్పులు చోటు చేసుకోవడంతో అగ్రరాజ్యం వణుకుతోంది.
ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.ఆదివారం లాస్ ఏంజిల్స్ సమీపంలోని చర్చి వద్ద ఒక వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ఒకరు మరణించగా.మరో నలుగురి పరిస్ధితి విషమంగా వుంది.
పోలీసులు వచ్చే లోపు చర్చిలోని భక్తులే నిందితుడిని తాళ్లతో కట్టేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో హ్యుస్టన్ మార్కెట్‌లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.
మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కారణంగానే కాల్పులు జరిగినట్లుగానే పోలీసులు తెలిపారు.
ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.వారి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
"""/" /
ఇకపోతే.బఫెలో నగరంలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు.
నల్లజాతీయులే లక్ష్యంగా శ్వేతజాతి ఉన్మాది ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.దుండగుడి పేరు పేటన్ జెండ్రన్, అతని స్వస్థలం న్యూయార్క్ రాష్ట్రంలోని కాంక్లిన్.
ఎవ్వరూ తనను అనుమానించకుండా ఉండేందుకు గాను జెండ్రన్ ఆర్మీ దుస్తులు ధరించాడు.నిందితుడిని అడ్డుకునేందుకు యత్నించి సూపర్ మార్కెట్ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలో గన్ కల్చర్‌పై మరోసారి పెద్ద చర్చ జరుగుతోంది.
ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ నెక్‌కు చెప్పేయండి గుడ్ బై!