యూఎస్ వీసా రెన్యువల్ చేసుకునే వారికి శుభవార్త.. ఇంటర్వ్యూ మీకు మినహాయింపు!

అవును, యూఎస్ వీసా రెన్యువల్( US Visa Renewal ) చేసుకునే వారికి ఇది నిజంగానే మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు.

స్కిల్డ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆకర్షించేందుకు చాలా దేశాలు తమ వీసా నియమాలను సవరిస్తూ వస్తున్నాయి.

అయితే రూల్స్ ఎలా ఉన్నప్పటికీ అమెరికా( America ) వెళ్లేందుకు వీసాల కోసం ఎదురుచూసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే వుంది.

ఎందుకంటే మనవాళ్ళు డాలర్ డ్రీమ్స్ ఎక్కువమరి.ఈ నేపథ్యంలో యూఎస్‌ వీసాను రెన్యువల్‌ చేసుకోవాలనుకునే ట్రావెలర్స్‌కు ఇండియాలోని యూఎస్‌ ఎంబసీ( US Embassy ) శుభవార్త చెప్పింది.

"""/" / విషయం ఏమంటే, ప్రీవియస్‌ వీసాలపై 'క్లియరెన్స్ రిసీవ్డ్‌' లేదా 'డిపార్ట్‌మెంట్ ఆథరైజేషన్' ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఇన్‌ పర్సన్‌ ఇంటర్వ్యూకి హాజరు కావలసిన అవసరం లేదు.

అవును, ఆ ఇంటర్వ్యూ లేకుండానే కొత్త వీసా కోసం అప్లై చేసుకోవచ్చు.యూఎస్‌ ఎంబసీ లేదా కాన్సులేట్‌లో ఇన్‌ పర్సన్‌ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిన అనేక మంది ప్రయాణికులకు ఈ కొత్త ఇంటర్వ్యూ మినహాయింపు పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు.

ఇపుడు వీసా అప్లికేషన్‌ ప్రాసెస్‌ను మరింత సులువుగా, సమర్థవంతంగా, క్రమబద్ధీకరించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

"""/" / ఇంతకూ మునుపు ఏదైనా వీసా పొందిన దరఖాస్తు చేస్తున్న ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది.

అయితే ఈ నియమానికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి.అవేమంటే ఇంతకుమునుపు వీసా రిజెక్ట్ అయిన దరఖాస్తుదారులు, అప్పీల్ చేయకపోయినా లేదా రిజక్ట్ కావడానికి తలెత్తే సమస్యలను పరిష్కరించకపోయినా ఈ ప్రాసెస్‌కు అర్హులు కారు అని గుర్తుపెట్టుకోవాలి.

ఇంటర్వ్యూ మినహాయింపు ప్రక్రియకు అర్హులైనాకూడా ఇటువంటి సందర్భాల్లో US ఎంబసీ లేదా కాన్సులేట్‌లో ఇంటర్వ్యూకి హాజరుకావలసి ఉంటుంది.

ఇక్కడ కాన్సులర్ అధికారి నిర్ణయమే తుది నిర్ణయం.