తాత యాదిలో.. జాంబియాలో పీవీ గోపాలన్ ఇంటిని సందర్శించిన కమలా హారిస్, భావోద్వేగం

తాత యాదిలో జాంబియాలో పీవీ గోపాలన్ ఇంటిని సందర్శించిన కమలా హారిస్, భావోద్వేగం

అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్( Kamala Harris ) ప్రస్తుతం జాంబియాలో పర్యటిస్తున్నారు.

తాత యాదిలో జాంబియాలో పీవీ గోపాలన్ ఇంటిని సందర్శించిన కమలా హారిస్, భావోద్వేగం

ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ మూలాలను గుర్తుచేసుకున్నారు.తన తల్లి గారి తండ్రి, తాత పీవీ గోపాలన్‌ను( PV Gopalan ) ఆమె స్మరించుకున్నారు.

తాత యాదిలో జాంబియాలో పీవీ గోపాలన్ ఇంటిని సందర్శించిన కమలా హారిస్, భావోద్వేగం

ఈ సందర్భంగా లుసాకాలో గోపాలన్ నివసించిన ఇంటికి కమలా హారిస్ వెళ్లారు.ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడితో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో కమలా హారిస్ మాట్లాడుతూ.

తన తాత భారత్‌లో సివిల్ సర్వెంట్ ఉద్యోగని చెప్పారు.1966లో జాంబియా( Zambia ) స్వాతంత్ర్యం పొందిన కొద్దికాలానికి ఆయన సహాయక చర్యలు , శరణార్ధుల డైరెక్టర్‌గా పనిచేయడానికి లుసాకాకు వచ్చారని కమలా హారిస్ గుర్తుచేసుకున్నారు.

ఈ క్రమంలో జాంబియా తొలి అధ్యక్షుడు కెన్నెత్ కౌండాకు( Kenneth Kaunda ) సలహాదారుగా పనిచేశారని ఆమె చెప్పారు.

తాను చిన్నతనంలో ఇక్కడ గడిపిన క్షణాలను జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని చెప్పారు.మా అత్త లుసాకా సెంట్రల్ హాస్పిటల్‌లో పనిచేసే సమయంలో కొన్ని జ్ఞాపకాలు వున్నాయని కమలా హారిస్ అన్నారు.

తన కుటుంబ సభ్యుల తరపున జాంబియా ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.జనవరి 1966లో జాంబియా ప్రభుత్వానికి సహాయ చర్యలు, శరణార్ధుల డైరెక్టర్‌గా భారత ప్రభుత్వం పీవీ గోపాలన్‌ను నియమించింది.

ఇందుకోసం ఆయన అప్పటికే భారత ప్రభుత్వంలోని పునరావాస మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీ కార్యాలయ అధిపతిగా అత్యున్నత పదవిని వదులుకున్నారు.

అనంతరం 1969లో జాంబియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పునరావాస మంత్రిత్వ శాఖలో ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ కార్యాలయ బాధ్యతలను తిరిగి పొందారు.

"""/" / ఇకపోతే.లుసాకాలో గోపాలన్ నివసించినట్లుగా చెబుతున్న ఇంటిని గుర్తించేందుకు అమెరికా రాయబార కార్యాలయం , కమలా హారిస్ కార్యాలయం తీవ్రంగా ప్రయత్నించాయి.

వైట్ హౌస్ అధికారి చెబుతున్న దానిని బట్టి 1960లలో లుసాకాలో వున్నప్పుడు గోపాలన్ కుటుంబం 16 ఇండిపెండెన్స్ అవెన్యూలో నివసించింది.

అయితే ఆ తర్వాతి రోజుల్లో ఆ ప్రాంత చిరునామాలు మార్చబడ్డాయి.పబ్లిక్ రికార్డులు, ల్యాండ్ సర్వేలలో ఫ్లాట్ నెంబర్‌లను ఉపయోగించి ఎట్టకేలకు గోపాలన్ నివసించిన ఇంటిని గుర్తించారు అధికారులు.

ఈ విషయంలో భారత ప్రభుత్వ సాయాన్ని కూడా తీసుకున్నారు. """/" / జాంబియన్ మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్స్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తుల సాయంతో మార్చి 9, 1967 నాటికి పబ్లిక్ ల్యాండ్ డాక్యుమెంట్‌లో నమోదు చేయబడిన 16 ఇండిపెండెన్స్ అవెన్యూను గోపాలన్ కుటుంబ నివాసంగా గుర్తించారు.

అయితే ఈ ఆస్తి ఇప్పుడు మాడిసన్ గ్రూప్ ఆధీనంలో వుంది.ఇక్కడి నుంచి మాడిసన్ జనరల్ ఇన్సూరెన్స్, మాడిసన్ ఫైనాన్షియల్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

అమెరికన్ స్పేస్ కంపెనీనికి సారథిగా భారతీయుడు.. ఎవరీ తేజ్‌పాల్ భాటియా?