ఇండియా వచ్చే టూరిస్ట్ లకి ఆ దేశం బ్రిటన్ హెచ్చరికలు... అంతా దిశ ఎఫెక్ట్

ఈ మధ్యకాలంలో ఇండియాలో ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.అత్యాచారం చేసి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలని కిరాతకంగా చంపేస్తున్నారు.

అయితే ఇండియాలో చట్టాలు సరైన విధంగా లేకపోవడం అత్యాచారం, హత్య చేసిన కూడా ఎప్పటికో వారికి శిక్షలు పడటంతో మానవ మృగాళ్లు వాటిని లేక్కచేయనట్లే తరుచు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కనిపిస్తుంది.

ఇలా మహిళల మీద లైంగిక దాడులు పెరిగిపోవడంతో ఇండియా వచ్చే విదేశీ మహిళా టూరిస్ట్ లకి ఆయా దేశాలు ముందుగానే పలు జాగ్రత్తలు చెబుతున్నాయంటే ప్రపంచ దృష్టిలో ఇండియా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా ఇండియా వచ్చే బ్రిటిష్ మహిళా టూరిస్ట్ లకి అక్కడి ట్రావెల్ అడ్వైజరీ కొన్ని కీలక సూచనలు చేసింది.

ఇండియా మహిళలకి మాత్రమే కాకుండా విదేశీ మహిళలకి కూడా భారత్ లో రక్షణ లేదని వాఖ్యలు చేసింది.

ఈ నేపధ్యంలో ఇండియా వెళ్ళే మహిళలు అక్కడ కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పింది.

ఇండియాలో ఎక్కడ ఒంటరిగా తిరగొద్దని చెప్పింది.అలాగే ఇండియాలో భారతీయ సంప్రదాయ దుస్తులే ఎక్కువగా ధరించాలని సూచించింది.

బీచ్ లలో ఒంటరిగా తిరగొద్దని, టాక్సీలలో, ఆటోలలో ఒంటరిగా ప్రయాణం చేయొద్దని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే 100కి ఫోన్ చేయాలని, అలాగే లైంగిక వేధింపులకి గురవుతున్నట్లు అనిపిస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్లకి ఫోన్ చేయాలని సూచించింది.

అయితే ఈ సూచనలు అన్ని అక్కడి ట్రావెల్ అడ్వైజరీ దిశ సంఘటన జరగడానికి వారం రోజుల ముందు చెప్పింది.

ముద్రగడ ‘ పై కుమార్తె ఫైర్.. పవన్ కు మద్దతు