ఈబీ-5 వీసాల జారీపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కీలక ప్రకటన

అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) భాగస్వామ్యంతో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ .

( US State Department ) 2024 ఆర్ధిక సంవత్సరానికి గాను ఉపాధి ఆధారిత ఐదవ ప్రాధాన్యత (EB-5) అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో అందుబాటులో ఉన్న అన్ని వీసాలను మంజూరు చేసినట్లు ఇటీవల ధృవీకరించింది.

అమెరికాలో వ్యాపారాలను ప్రారంభించాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు( Foreign Investors ) ఈబీ -5 వీసాలు కీలకమైనవి.

దేశవ్యాప్తంగా ఉద్యోగ సృష్టి, ఆర్ధిక వృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. """/" / యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ (యూఎస్ఐఎఫ్) అధ్యక్షుడు , సీఎంవో నికోలస్ మాస్ట్రోయిని( Nicholas Mastroianni ) మాట్లాడుతూ.

ఈబీ-5 వీసాలు( EB-5 Visa ) అమెరికాలో స్థిరమైన భవిష్యత్తును నిర్ధారిస్తాయన్నారు.యూఎస్ వీసా ల్యాండ్‌స్కేప్ ఒక మైన్‌ఫీల్డ్ వంటిదన్న ఆయన హెచ్1బీ వీసాపై మాత్రమే ఆధారపడటం భవిష్యత్తుతో జూదం వంటిదన్నారు.

ఈ వీసాల జారీ .ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (ఐఎన్ఏ) ద్వారా నిర్వహించబడుతుంది.

ఇది ఉపాధి ఆధారిత వలస వీసాల సంఖ్యపై వార్షిక పరిమితులను నిర్దేశిస్తుంది.ఈబీ-5 వర్గానికి సంబంధించి , ఈ పరిమితి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం ఉపాధి ఆధారిత వీసాలలో 7.

1 శాతం. """/" / సీ5, టీ5, ఐ5, ఆర్5, ఆర్‌యూ, ఎన్‌యూ వంటి కేటగిరీలు సహా అన్ రిజర్వ్‌డ్ వీసా వర్గాలకు 68 శాతం కేటాయింపులు జరిగాయి.

దీనితో పాటు ఈబీ-5 రీఫార్మ్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ 2022 ప్రకారం.2022 ఆర్ధిక సంవత్సరం నుంచి ఉపయోగించని ఈబీ-5 రిజర్వ్‌డ్ వీసాలు 2024 ఆర్ధిక సంవత్సరానికి అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలలో చేర్చడానికి అనుమతిస్తుంది.

తాజా ఆర్ధిక సంవత్సరానికి అన్ని ఈబీ 5 అన్‌ రిజర్వ్‌డ్ వీసాలు ప్రస్తుతానికి కేటాయించబడినందున.

అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు అన్ని కేటగిరిలలో వీసాల జారీని మిగిలిన ఆర్ధిక సంవత్సరంలో నిలిపివేస్తాయి.

ఇకపోతే.అమెరికా వెళ్లాలనుకుంటున్న వారికి కీలకమైన హెచ్ 1, ఎల్ 1, ఈబీ 5 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా రుసుములు పెరిగిన సంగతి తెలిసిందే.

ఇమ్మిగ్రేషన్‌ విధానాలు , అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే వీసా సేవల్లో మార్పులు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది.

దేవర మూవీ సక్సెస్‌లో ఎన్టీఆర్ కంటే అతనిదే ఎక్కువ పాత్ర..?