భారతీయులపై అభిమానం చాటుకున్న అమెరికన్ సింగర్: సంస్కృతంలో న్యూఇయర్ విషెస్

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా .ఎవరినైనా సరే భారతీయ సాంప్రదాయాలు ఆకర్షిస్తూనే వుంటాయి.

అందుకే పాశ్చాత్యులు సైతం భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ముగ్ధులై పోతుంటారు.ఎంతోమంది విదేశీయులు మనదేశానికి వచ్చి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారంటే అది మన సనాతన ధర్మం గొప్పదనం.

భారతీయులను ఎన్నో దేశాల ప్రజలు ప్రేమిస్తారు, గౌరవిస్తారు.తాజాగా మనదేశంపై తన అభిమానాన్ని చాటుకున్నారు అమెరికన్ పాప్ సింగర్, నటి మేరీ మిల్లీబెన్.

మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో ఉగాది జరుపుకున్నట్లే.మనదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేరే పేర్లతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి, భారతీయులకు మేరీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

వీడియో ద్వారా సంస్కృత శ్లోకంతో ప్రారంభించి భార‌తీయుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

మంత్రం ప‌ఠించిన తరువాత.ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు నూతన సంవత్సరం సంద‌ర్భంగా అభినంద‌న‌లు చెప్పారు.

సాంప్రదాయ హిందూ పండుగల గురించి తాను మరింత తెలుసుకోవాలనుకుంటున్నానని ఆమె వెల్లడించారు.భారతీయ సంస్కృతితో తన సంబంధం మరింత బలపడుతోందని.

తాను భారతదేశం గురించి తెలుసుకున్నప్పుడు, ఈ దేశంపై తన ప్రేమ ఇంకా పెరుగుతోందని మేరీ మిల్లీబెన్ వీడియోలో పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా తన హిందీ గురువు డాక్టర్ మోక్స్‌రాజ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, గతేడాది దీపావళి పండుగతో పాటు భారత స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా కూడా మేరీ మిల్బ‌న్.

భార‌తీయుల‌కు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.ఉత్తర భారతంలో దేవునికి హరతి ఇచ్చే సందర్భంగా పాడే ‘ఓం జై జగదీష్ హరే అంటూ ఆమె సాంప్రదాయ భారతీయ వస్త్రాలు ధరించి పాడిన పాటకు భారీగా వీక్షణలు లభించాయి.

"""/"/ మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా భారతీయ అమెరికన్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

వైశాఖి, నవరాత్రి, సాంగ్‌క్రాన్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న దక్షిణాసియా, ఆగ్నేయాసియా వాసులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

హ్యాపీ బెంగాలీ, కంబోడియాన్, లావో, మయన్మారీస్, నేపాలీ, సింహళీస్, తమిళ్, థాయ్, విషు న్యూ ఇయర్!" అని బైడెన్ ట్వీట్ చేశారు.

అలాగే వైశాఖి సందర్భంగా కొంతమంది చట్టసభ సభ్యులతో కలిసి అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ భారతీయ-అమెరికన్లు, సిక్కులను కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఓటమి భయంతో కాంగ్రెస్ నీచ రాజకీయాలు..: బండి సంజయ్