నా మతాన్ని ఎత్తిచూపుతూ..నా వాళ్లే దాడి చేస్తున్నారు, రిపబ్లికన్లపై భారత సంతతి మహిళ ఆరోపణలు

నా మతాన్ని ఎత్తిచూపుతూనా వాళ్లే దాడి చేస్తున్నారు, రిపబ్లికన్లపై భారత సంతతి మహిళ ఆరోపణలు

అమెరికాలోని రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ) అధ్యక్ష పదవికి పోటీపడుతోన్న ఇండో అమెరికన్ న్యాయవాది హర్మీత్ ధిల్లాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా మతాన్ని ఎత్తిచూపుతూనా వాళ్లే దాడి చేస్తున్నారు, రిపబ్లికన్లపై భారత సంతతి మహిళ ఆరోపణలు

తాను సిక్కు వ్యక్తిని కావడం వల్లే తన తోటి నాయకులు, మతోన్మాదుల నుంచి దాడులను ఎదుర్కొంటున్నానని చెప్పారు.

నా మతాన్ని ఎత్తిచూపుతూనా వాళ్లే దాడి చేస్తున్నారు, రిపబ్లికన్లపై భారత సంతతి మహిళ ఆరోపణలు

కాలిఫోర్నియా రాష్ట్ర రిపబ్లిక్ పార్టీ కో చైర్‌గా పనిచేసిన 54 ఏళ్ల ధిల్లాన్.

ఆర్ఎన్‌సీ పదవి కోసం శక్తివంతమైన రోన్నా మెక్‌డానియల్‌తో తలపడుతున్నారు.మతోన్మాద దాడులు, జవాబుదారీతనం, పారదర్శకత, సమగ్రతలకు సంబంధించి సోమవారం వరుస ట్వీట్లు చేశారు ధిల్లాన్.

దీంతో తనకు చాలా బెదిరింపు ట్వీట్లు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.ఆర్ఎన్‌సీకి అత్యధిక విరాళాలు ఇస్తున్న వారి గురించి ప్రశ్నించినందుకు తన బృందంలోని మరో వ్యక్తికి బెదిరింపు కాల్ వచ్చిందని ధిల్లాన్ పేర్కొన్నారు.

రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ) ఛైర్‌పర్సన్ ఎన్నిక జనవరి 27న జరగనుంది.మెక్‌డానియల్‌పై పోటీ చేసేందుకు ధిల్లాన్‌కు పలువురి ఎండార్స్‌మెంట్లు లభించాయి.

గత వారం ఓ వార్తాపత్రికలో హర్మీత్ రాజకీయ ప్రత్యర్ధులు ఆమె సిక్కు మత విశ్వాసాల గురించి ఆందోళనలు చేశారని వచ్చింది.

ఈ పరిణామం కమిటీలోని కొంతమంది సభ్యులను కలవరపాటుకు గురిచేసింది.దీనిపై ధిల్లాన్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

"""/"/ ఆర్ఎన్‌సీ కుర్చీ రేసులో వున్న కొందరు .తన సిక్కు మత విశ్వాసాన్ని తనపై ఆయుధంగా ఉపయోగించి తన సమర్ధతను ప్రశ్నించడం బాధ కలిగించిందన్నారు.

అయితే ప్రస్తుతం ఆర్ఎన్‌సీ కమిటీ ఛైర్మన్‌గా వున్న ధిల్లాన్ ప్రత్యర్ధి మెక్ డానియల్ సైతం ఈ తరహా దాడిని ఖండిస్తున్నట్లు తెలపడం విశేషం.

"""/"/ ఇదిలావుండగా.1969 జూలై 19న పంజాబ్‌లోని చండీగఢ్‌లో జన్మించారు హర్మీత్ ధిల్లాన్.

ఆమె పసితనంలోనే ధిల్లాన్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.హర్మీత్ తండ్రి ఆర్థోపెడిక్ సర్జన్.

అనంతరకాలంలో నార్త్ కరోలినాలోని స్మిత్‌ఫీల్డ్‌లో ఆమె కుటుంబ స్ధిరపడింది.తర్వాత డార్ట్‌మౌత్ కాలేజీలో చదువుకున్నారు హర్మీత్.

యూనివర్సిటీ ఆఫ్ వర్జినియా స్కూల్ ఆఫ్ లాలో గ్రాడ్యుయేషన్ చేసిన హర్మీత్ ధిల్లాన్ .

తర్వాత పలువురు పేరు మోసిన అటార్నీల వద్ద క్లర్క్‌గా పనిచేశారు.రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలైన ఆమె పార్టీలో చేరి క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు.

2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగానూ విధులు నిర్వర్తించారు.

చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో ఆ సీన్ ఉంటుందా..?