భారత్ శాశ్వత వ్యూహాత్మక రక్షణ భాగస్వామి కావాలి: అమెరికా సెనేటర్ ప్రతిపాదన

గత కొన్నేళ్ల నుంచి భారత్- అమెరికాల మధ్య అన్ని రకాలుగా అనుబంధం పెరుగుతోంది.

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా మనదేశానికి అగ్రరాజ్యం బాసటగా నిలుస్తోంది.ఈ క్రమంలో యూఎస్ సెనేటర్ మార్క్ వార్నర్ భారతదేశాన్ని అమెరికాకు శాశ్వత వ్యూహాత్మక రక్షణ భాగస్వామిగా మార్చడానికి ఓ చట్టాన్ని ప్రతిపాదించారు.

అమెరికా పార్లమెంట్‌ ఎగువసభలో ఇంటెలిజెన్స్‌పై శాశ్వత ఎంపిక కమిటీకి వార్నర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ డెమొక్రాట్ సెనేటర్ భారత్‌తో బంధాన్ని మరింత బలపరుచుకోవాలని భావించారు.

దీనిలో భాగంగా ఆయన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ)కు సవరణ ప్రతిపాదించారు.

జూలై 22న యూఎస్- ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులతో చర్చ సందర్భంగా వార్నర్ ఈ విషయం తెలిపారు.

ముఖ్యంగా చైనా నిఘా, బెదిరింపు దోరణి, చైనీస్ కంపెనీల మేధో సంపత్తి చోరీపై భారత్ ఆందోళన చెందుతున్న వేళ.

అమెరికాతో భాగస్వామ్యం ముఖ్యమని వార్నర్ అభిప్రాయపడ్డారు.ఈ ముప్పును ఎదుర్కోవడానికి తమదేశం జపాన్, దక్షిణ కొరియా, భారత్‌లతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.

"""/"/ మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులు వార్నర్ ప్రతిపాదనను ఆమోదించారు.అలాగే దక్షిణ చైనా సముద్రం, హిమాలయ ప్రాంతాల్లో చైనా కవ్వింపులు ఆయా దేశాలకు ముప్పుగా ఉన్నందున అవి అమెరికా సాయం కోసం ఎదురుచూస్తున్నాయని కౌన్సిల్ సభ్యులు అన్నారు.

ఇదే సమయంలో భారతీయ అమెరికన్ రమేశ్ కపూర్ యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో మాట్లాడుతూ.

అమెరికా తన కంపెనీలను చైనా భూభాగం నుంచి తరలించేలా చూడాలని కోరారు.మరో సభ్యుడు మాట్లాడుతూ అమెరికాకు చెందిన చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు భారతదేశాన్ని తమ కార్యస్థానంగా చేసుకోవాలని సూచించారు.

అద్భుతమైన ఈ మొక్క.. ఎక్కడ కనిపించినా వదలకండి..!