ఒమిక్రాన్ భయాలు.. మేల్కోన్న అమెరికన్లు, వ్యాక్సిన్‌ కోసం బారులు..!!

కోవిడ్ నుంచి కాపాడేది వ్యాక్సిన్ ఒక్కటేనని నిపుణులు ఎంత హెచ్చరించినా అమెరికన్లు పెడ చెవిన పెట్టారు.

దేశంలో ఎన్నో కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మెజారిటీ అమెరికన్లను ఇంకా కొన్ని భయాలు వెంటాడుతున్నాయి.

ముఖ్యంగా అక్కడి 18 నుంచి 49 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారిలో ఇంకా స‌గం మంది టీకా తీసుకోలేదు.

సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ కావడంతో చాలా మంది టీకాలు తీసుకోవడానికి వెనుకాడారు.

దీనిని తొలగించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ సైతం తీవ్రంగా యత్నించారు.అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.

అయితే కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లు.ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం.

డెల్టా వేరియంట్ కంటే ఇది భయంకరమైనదని నిపుణులు హెచ్చరిస్తుండటంతో అమెరికన్ల వెన్నులో వణుకు మొదలైంది.

ఇప్పటి వరకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోని వారు కూడా టీకా సెంటర్లకు పరుగులు తీస్తున్నారు.

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గణాంకాల ప్రకారం.

ఇటీవలి వారాల్లో వ్యాక్సిన్ డిమాండ్ రోజుకు సగటున మిలియన్ డోసుల నుంచి 1.

5 మిలియన్లకు పెరిగిందట.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక్కొక్క రాష్ట్రం ఒమిక్రాన్ పడగ నీడ కిందకు వెళ్తుండటంతో టీకా కేంద్రాలలో భారీ క్యూలు కనిపిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాలను ప్రచురించింది.

మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్ .అమెరికాలో నెమ్మదిగా విస్తరిస్తోంది.

సరిహద్దులు మూసేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది అడుగుపెట్టేస్తోంది.అయితే ఇప్పుడు అందరిదీ ఒకటే టెన్షన్.

ఈ వేరియంట్‌ను ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు అడ్డుకోగలవా.లేదా అని.

అయితే కొందరు నిపుణులు మాత్రం బూస్టర్ డోస్ ఆవశ్యకతను తెలియజేస్తున్నారు.కొత్త వ్యాక్సిన్ కోసం ఎదురుచూడకుండా వీలైనంత త్వరగా బూస్టర్ డోసును తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు భవిష్యత్తులో వచ్చే ఇతర వేరియంట్లతోనూ పోరాడే సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయని చెబుతున్నారు.

"""/" / ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ సైతం దేశ ప్రజలను బూస్టర్ డోస్ దిశగా సమాయత్తం చేస్తున్నారు.

శీతాకాల ప్రణాళికలో భాగంగా బూస్టర్‌ డోసులను ఇప్పించాలని బైడెన్‌ భావిస్తున్నారు.దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాన్ని సైతం ప్రారంభించనున్నారు.

అమెరికాలో మొత్తం పది కోట్ల మంది బూస్టర్‌ డోసులకు అర్హత సాధించారు.ప్రభుత్వం, అధికారులు, స్వచ్చంధ సంస్థలు ఎంతగా ప్రయత్నించినా మరో 40.

3 లక్షల మంది రకరకాల కారణాలతో అసలు టీకా జోలికే వెళ్లలేదు.వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బూస్టర్‌ డోసులపై అవగాహన కల్పించనున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : పెన్సిల్వేనియా ప్రైమరీలో ట్రంప్‌కు షాక్ .. నిక్కీహేలీదే విజయం