అమెరికాలో విచిత్ర రెస్టారెంట్..దానికి కూడా బిల్లు వేస్తారు...!!!

రోజు ఇంట్లో ఫుడ్ తినాలంటే బోర్ గా అనిపిస్తుంది కొంత మదికి.హోటల్ కి వెళ్లి టిఫిన్ తినటమన్నా, ఏదైనా రెస్టారెంట్ లో భోజనం చేయటమన్నా చాల మందికి సరదాగా ఉంటుంది.

హోటల్ కి వెళ్లి ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి తృప్తిగా తిని, చివరిలో తిన్న ఐటమ్స్ కి బిల్ కట్టేసి వస్తుంటారు.

ఇలాంటి మూడ్ లోనే హోటల్ కి వెళ్ళాడు అమెరికాలోని ఓ యువకుడు ఆర్డర్ ఇచ్చాడు, కావాల్సింది తిన్నాడు, తీరా బిల్లు చూసి ఖంగుతిన్నాడు.

ఇంతకీ ఆ బిల్ లో ఏముంది.?? ఆ వివరాలలోకి వెళ్తే.

అమెరికాకు చెందిన ఓ యువకుడు రెస్టారెంట్ కి వెళ్లి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు.

అక్కడ వెయిటర్ కుడా ఆర్డర్ చేసినవన్నీ తీసుకొచ్చింది, మధ్య మధ్యలో ఏవో ప్రశ్నలు కూడా వేశాడు ఆ అబ్బాయి.

అతడు అడిగిన ప్రశ్నలకి నవ్వుతూ సమాధానం చెప్పింది వెయిటర్.ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, చివరికి బిల్ కట్టడానికి ఆమె ఇచ్చిన బిల్లు చూసి షాక్ అయ్యాడు.

ఆ బిల్లులో తిన్నడానికి మాత్రమే కాదు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసినందుకు కూడా డబ్బులు ఇవ్వాలని ఉంది.

ఆ బిల్ లో పిచి ప్రశ్న కి రూ.27 ($ 0.

38) అని ఉంది.కోపంతో సదరు యువకుడు ఊగిపోయాడు.

ఆ తరువాతా తీరికగా ఆ బిల్లు చూసుకున్నాడు.ఆ పిచ్చి ప్రశ్నలకి డబ్బులు బిల్ లో కలపలేదు.

దాంతో వెయిటర్ వైపు చూస్తే ఆమె నవ్వుతూ కనిపించింది. """/" / దాంతో సరదాకి చేసిన పని ఇదంతా అని ఇద్దరూ 2 నిమిషాల పాటు నవ్వుకున్నారు.

ఇదే తంతు ఆ హోటల్ లో గత 20 ఏళ్ళుగా జరుగుతోందట.అంతే కాదు, ఈ హోటల్ మెనూ కార్డు లో కూడా స్టుపిడ్ క్యూస్షన్స్ అని ఉంటుంది.

ఏంటి ఇదంతా అని ఎవరైన ఆ హోటెల్ వాళ్ళని అడిగితే, ఇక్కడికి వచ్చే అందరికి వినోదాన్ని అందిచాలని, సంతోషంగా ఉంచటమే వాళ్ళ ఉద్దేశ్యమని చెప్తున్నారు ఆ హోటల్ సిబ్బంది.

ఇంతకి ఈ హోటల్ ఎక్కడ ఉందంటే అమెరికాలోని డెన్వర్‌(కొలరాడో రాష్ట్ర రాజధాని)లో ఉంది.

ఈ రెస్టారెంట్ పేరు టామ్స్(Tom's) డైనర్.

నారా దేవాన్ష్ ను ప్రశంసించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?