అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌కు షాక్ , కమలా హారిస్‌కు ఊహించని మద్ధతు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌కు షాక్ , కమలా హారిస్‌కు ఊహించని మద్ధతు

మరో నాలుగు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు(Kamala Harris ,Donald Trump) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌కు షాక్ , కమలా హారిస్‌కు ఊహించని మద్ధతు

ఎన్నికల్లో ప్రజలు, కమ్యూనిటీలు ఎవరి వైపు ఉన్నారన్న దానిపై ముందస్తు అంచనాలు, ఓపీనియన్ పోల్స్ ఎప్పటికప్పుడు వెలువడుతున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌కు షాక్ , కమలా హారిస్‌కు ఊహించని మద్ధతు

తాజాగా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కమలా హారిస్‌కు ఊహించని మద్ధతు లభించింది.ఎన్‌బీఏ ఆల్‌టైం లీడింగ్ స్కోరర్ , అమెరికా అగ్రశ్రేణి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ (LeBron James)గురువారం తన మద్ధతును కమలా హారిస్‌కు ప్రకటించారు.

"""/" / నా పిల్లలు, కుటుంబం గురించి ఆలోచించినప్పుడు వారు ఎలా పెరుగుతారోనన్న భయం ఉందని అందుకే నా ఓటు కమలా హారిస్‌కేనని, మీరూ ఆమెకే వేయండి అని సోషల్ మీడియాలో జేమ్స్ (James) పోస్ట్ పెట్టాడు.

నల్లజాతి కమ్యూనిటీకి చెందిన జేమ్స్ .డెమొక్రాటిక్ పార్టీకి తొలి నుంచి అండగా నిలుస్తున్నారు.

2016లో ట్రంప్‌కు వ్యతిరేకంగా హిల్లరీ క్లింటన్‌కు తన మద్ధతు పలుకుతున్నారు.2020లో ట్రంప్‌కు కాకుండా జో బైడెన్‌ను (Joe Biden)ఎండార్స్ చేశారు జేమ్స్.

నల్లజాతి పురుషుల్లో మద్ధతు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న కమలా హారిస్‌కు జేమ్స్ అండగా నిలవడం పెద్ద బూస్టప్‌లా పనిచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

"""/" / ఇప్పటికే కమలా హారిస్‌కు పలువురు సెలబ్రెటీలు మద్ధతు పలికిన సంగతి తెలిసిందే.

హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రీప్, క్రిస్ రాక్, మాజీ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే, స్టార్ సింగర్స్ బెయోన్స్, టేలర్ స్విఫ్ట్‌లు(Meryl Streep, Chris Rock, Former Talk Show Host Oprah Winfrey, Star Singers Beyonce, Taylor Swift) కమలా హారిస్‌కు జైకొట్టారు.

లాస్ ఏంజెల్స్ లేకర్స్ ఫార్వర్డ్ జేమ్స్.ఈ వేసవిలో పారిస్ గేమ్స్‌లో అమెరికా జట్టుకు ఒలింపిక్ గేమ్ సాధించి పెట్టాడు.

ప్రస్తుతం ఆయన ఎన్‌బీఏ తన 22వ సీజన్‌లో ఆడుతున్నాడు.వలసలపై ట్రంప్, అతని మద్దతుదారులు చేసిన వ్యాఖ్యలను జేమ్స్ తప్పుబడుతున్నారు.

కమలా హారిస్‌కు మద్ధతు పలుకుతూ నాటి వీడియోను ఆయన షేర్ చేశారు.ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ పుష్ప మూవీ బాటలో నడుస్తున్న అఖిల్.. ఈసారి సంచలన విజయం పక్కా!