అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా కమలా హారిస్ పేరు ఖరారు
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిగా భారత సంతతి నేత, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ( Kamala Harris )అభ్యర్ధిత్వం ఖరారైంది.
ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.నిన్న మొన్నటి వరకు బరిలో నిలిచిన అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden )వృద్ధాప్యం, అనారోగ్యం తదితర కారణాలతో పోటీ నుంచి తప్పుకున్నారు.
వెళ్తూ వెళ్తూ కమలా హారిస్‌కు మద్ధతు ప్రకటించారు.దీంతో డెమొక్రాట్ నేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల గవర్నర్లు , ఇండియన్ కమ్యూనిటీ ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
ముందస్తు సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌లోనూ కమల దూసుకెళ్తున్నారు. """/" /
అభ్యక్ష అభ్యర్ధిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను వర్చువల్ రోల్ కాల్‌లో ఆమె సాధించినట్లు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ ఛైర్ జేమ్ హరిసన్( Jaime Harrison ) ప్రకటించారు.
డెలిగేట్‌ల ఓటింగ్ ప్రక్రియ సోమవారం వరకు జరగనుండగా.మెజారిటీ ఓట్లను ఆమె పొందినట్లుగా ఆయన తెలిపారు.
చికాగో వేదికగా ఈ నెల చివరిలో జరగనున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమలా హారిస్ పేరును అధ్యక్ష అభ్యర్ధిగా లాంఛనంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అదే జరిగితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి అభ్యర్ధిగా పోటీ చేయనున్న విదేశీ సంతతికి చెందిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.
కమల అధికారిక నామినేషన్ ఆగస్ట్ 7న ఖరారు కానుంది. """/" /
ఇదిలాఉండగా.
అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్ పేరును ప్రకటిస్తారు సరే, మరి ఉపాధ్యక్ష అభ్యర్ధి ఎవరు అన్నది డెమొక్రాట్లలో చర్చనీయాంశమైంది.
అయితే చికాగో( Chicago)లోనే దీనిపై కమల క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం ఖరారు కావడంపై కమలా హారిస్ స్పందించారు.
ఇది తనకు దక్కిన గౌరవమని, మేం అమెరికాను ప్రేమిస్తామని, దేశం పట్ల ప్రేమతో, ఉత్తమమైన దాని కోసం పోరాడే వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకురావడమే నా ప్రచారం ఉద్దేశమని ఆమె తెలిపారు.
రజినీకాంత్ ఎందుకు వేట్టయన్ సినిమాతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు..