అమెరికా అధ్యక్ష ఎన్నికలు : భారతీయుల్లో బైడెన్‌కు మద్ధతు ఇచ్చే వారు ఎందరు.. వెలుగులోకి సంచలన సర్వే

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు( Indians ) ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.

భారత సంతతి క్రమంగా పెరగడంతో మనవాళ్లు అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .

ఉదాహరణకు అమెరికాను( America ) తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.

అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.

ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్‌, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.

అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.

భారత సంతతికి చెందిన కమలా హారిస్( Kamala Harris ) అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై భారతదేశ కీర్తిప్రతిష్టలను దశదిశలా వ్యాప్తి చేశారు.

ఈ ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయులు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.మరి వారి మద్ధతు ఎవరికీ.

డెమొక్రాట్లకా, రిపబ్లికన్లకా అన్నది తెలియాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ‘‘ Bi-annual Asian American Voter Survey (AAVS) ’’ బుధవారం కీలక గణాంకాలను వెల్లడించింది.

"""/" / 2020 - 2024 అధ్యక్ష ఎన్నికల మధ్య పోలికలను సర్వే స్పష్టంగా వెల్లడించింది.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బైడెన్‌కు( Joe Biden ) మద్ధతు ఇస్తున్న భారతీయ అమెరికన్లలో 19 శాతం క్షీణత నమోదైనట్లుగా సర్వే పేర్కొంది.

ఆసియన్ అండ్ పసిఫిక్ అమెరికన్ వోట్ (ఏపీఐఏ వోట్), ఏఏపీఐ డేటా, ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్ (ఏఏజేసీ), ఏఏఆర్పీ నిర్వహించిన సర్వే ప్రకారం 46 శాతం మంది భారతీయ అమెరికన్లు మాత్రమే బైడెన్‌కు ఓటు వేయాలనుకుంటున్నారట.

2020లో ఈ సంఖ్య 65 శాతంగా ఉండేది. """/" / బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జూన్ 27న జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్( Presidential Debate ) అనంతరం 46 శాతం మంది ఆసియా అమెరికన్లు మాత్రమే బైడెన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది.

2020తో పోలిస్తే ఆయనకు 8 శాతం పాయింట్లు తగ్గగా.31 శాతం మంది ట్రంప్‌కు ( Trump ) ఓటేసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆయనకు 2020తో పోలిస్తే ఒక పాయింట్ పెరిగినట్లు సర్వే తెలిపింది.ఏది ఏమైనప్పటికీ.

భారతీయ అమెరికన్ల నుంచి బైడెన్‌కు రికార్డు స్థాయిలో 19 శాతం మద్ధతు తగ్గినప్పటికీ.

అనుకూల రేటింగ్‌లో ట్రంప్ కేవలం 2 శాతం మాత్రమే (2020లో 28 శాతం నుంచి 2024లో 30 శాతం ) పొందారు.

గడిచిన రెండు దశాబ్ధాలుగా యూఎస్‌లో ఆసియా అమెరికన్లు వేగంగా వృద్ధి చెందుతున్న ఓటర్ల సమూహంగా ఉన్నారు.

గత నాలుగేళ్లలో వీరు 15 శాతం వృద్ధి చెందడం గమనార్హం.2020లో బ్యాటిల్ గ్రౌండ్‌ రాష్ట్రాల్లో ఆసియా అమెరికన్ ఓటర్లలో మొదటిసారి ఓటు వేసే వారి సంఖ్య పెరగడం బైడెన్ విజయానికి ముఖ్యకారణమని విశ్లేషకులు అంటారు.

ఇలాంటి వేళ బైడెన్‌కు భారతీయ అమెరికన్ల మద్ధతు తగ్గడం కీలక పరిణామంగా భావిస్తున్నారు.

ఇండియన్ రెస్టారెంట్‌లో ఫిష్, చిప్స్ ఆర్డర్ చేసిన బ్రిటిషర్‌.. కానీ ఏం వచ్చాయంటే..?