ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫ్యాన్స్..పాపం ఇలా అయ్యిందేంటి..!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

ట్విట్టర్ లో ఏ రాజకీయ నేతకు లేనతంగా ఆయనకు అభిమానులు వెల్లువలా వచ్చి పడ్డారు.

అయితే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి గొడుగు పట్టే నేతలులా ట్విట్టర్ లో ట్రంప్ ను ఫాలో అయ్యే అభిమానులు కూడా ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేస్తున్నారు.

ప్రస్తుతం లక్షలాది మంది ఫాలోవర్స్ ట్రంప్ ను వీడి వెళ్లిపోతున్నారు.పూర్తి వివరాలలోకి వెళ్తే.

ట్రంప్ ను ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారి సంఖ్యను పోల్చితే ప్రపంచంలో ఏ నేతలు అంత ఫాలోయింగ్ లేదనే చెప్పలి.

కానీ నవంబర్ 17 తర్వాత ట్రంప్ కు క్రమ క్రమంగా తన ఫాలోవర్స్ తగ్గుతూ వచ్చారు.

దాదాపు 1.40 లక్షల మంది ఫాలోవర్స్ ను ట్రంప్ కోల్పోయారట.

అయితే ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడు బిడెన్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

దాదాపు 11.56 లక్షల మంది బిడెన్ లు ఫాలో అవుతున్నట్టుగా ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలాంటే """/"/ ట్రంప్ ను ప్రస్తుతం ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 88.

8 మిలియన్లు కాగా బిడెన్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 20.

2 మిలియన్ల కు చేరుకుంది.ట్రంప్ మొదటి సారిగా ఇంత భారీ స్థాయిలో అభిమానులను కోల్పోయారని ట్విట్టర్ పేర్కొంది.

ఇదిలాఉంటే ట్రంప్ కి షాక్ ఇస్తూ ఇంతమంది ఎందుకు తగ్గిపోయారు అంటే అందుకు కారణం కూడా తెలిపారు పరిశీలకులు.

అధ్యక్ష ఎన్నికల్లో ప్రజామోదం మేరకు బిడెన్ విజయం సాధించారని కానీ అది విజయం కాదని తానె అధ్యక్షుడినని ట్రంప్ మొండి పట్టుబట్టడంతో ట్రంప్ వైఖరిపై ఫ్యాన్స్ విసుగు చెందారని అందుకే ఒక్కసారిగా ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ షాక్ ఇచ్చారని అంటున్నారు.

మచ్చలు పోయి ముఖం అందంగా మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి!