గురునానక్ జయంతి: ప్రపంచవ్యాప్తంగా వున్న సిక్కులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విషెస్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలి నుంచి భారతీయ సమాజంతో సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్నికల్లో జో బైడెన్ గెలిస్తే పెద్ద సంఖ్యలో భారతీయులకు కీలక పదవులు దొరుకుతాయన్న విశ్లేషకుల మాట అక్షరాల నిజమైంది.

ఇండో అమెరికన్ల సత్తాపై మంచి గురి వున్న బైడెన్.ఉపాధ్యక్ష పదవి సహా అత్యున్నత పదవులను కట్టబెట్టారు.

ఇప్పటి వరకు బైడెన్ టీంలో 60 మందికి పైగా ప్రవాస భారతీయులకు పదవులు దక్కాయి.

రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.ప్రత్యేకించి భారతీయ పర్వదినాల సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు.

తాజాగా సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 552వ జయంతి సందర్భంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న సిక్కులందరికీ జో బైడెన్ ఆయన సతీమణి జిల్ బైడెన్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఐదు శతాబ్ధాల క్రితమే గురునానక్ సమానత్వం, శాంతి, సేవ వంటి వాటిపై ఇచ్చిన సందేశం నేటికీ అత్యంత ప్రాముఖ్యత కలిగి వుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వున్న సిక్కులు శుక్రవారం గురునానక్ జయంతిని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.

15వ శతాబ్ధంలో అవిభక్త భారత్‌లోని పంజాబ్‌లో ఈ మతం పుట్టింది.నేడు ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.

"""/"/ 1469లో అవిభక్త భారతదేశం (ప్రస్తుత పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్)లోని ఒక హిందూ కుటుంబంలో గురునానక్ జన్మించారు.

మెహతా కలు, మాతా త్రిపుర దంపతులు ఆయన తల్లిదండ్రులు.హిందువుగా జన్మించిన గురునానక్.

తత్వవేత్తగా మారి.అనంతరం సిక్కు మతాన్ని స్థాపించారు.

జీవితంలోని రహస్యాలను అన్వేషించేందుకు ఇల్లు వదలిన గురు నానక్ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణంలో 974 శ్లోకాలను వ్రాశారు.

ఆయన అందించిన బోధనలు ‘‘గురు గ్రంథ్ సాహిబ్’’ (పవిత్ర పుస్తకం)లో ఉన్నాయి.ఇది సిక్కులకు పవిత్ర గ్రంథం.

గురు నానక్ తన జీవితం చివరి రోజుల్లో పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ జీవించారు.

22 సెప్టెంబరు 1539లో 70వ ఏట మరణించారు.అందుకే సిక్కులకు కర్తార్‌పూర్‌ గురుద్వారా పవిత్ర క్షేత్రం.

చైనాలో ఘోర యాక్సిడెంట్.. స్కూల్ పిల్లలపైకి దూసుకెళ్లిన బస్సు.. 11 మంది మృతి..