అధ్యక్ష ఎన్నికల వేళ కలకలం.. కోవిడ్ బారినపడ్డ జో బైడెన్ , అర్ధాంతరంగా సభ నుంచి ఇంటికి

అమెరికా అధ్యక్ష ఎన్నికల( US Presidential Elections ) ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది.

జో బైడెన్( Joe Biden ) డెమొక్రాటిక్ పార్టీ నుంచి, డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలో దిగారు.

ఇప్పటికే వీరిద్దరి మధ్యా జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ పై చేయి సాధించగా.

బైడెన్ తడబడ్డారు.దీనికి తోడు వృద్ధాప్య సమస్యలు, తరచుగా వైట్‌‌హౌస్‌కి వైద్యుల రావడం తదితర అంశాలు వెలుగులోకి వస్తూ ఉండటంతో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

"""/" / ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్‌ కరోనా( Corona ) బారినపడ్డారు.

ఈ విషయాన్ని అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.బైడెన్ స్వల్పంగా దగ్గు, జలుబు, స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారని.

ప్రస్తుతం ఆయన తన స్వస్థలం డెలావేర్‌లోని నివాసంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్‌లో( Las Vegas ) ప్రచారంలో పాల్గొన్నారు బైడెన్.

ఈ క్రమంలో వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా( Covid Positive ) తేలడంతో యునిడోస్ నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగి వెంటనే ఇంటికి చేరుకున్నారు.

ప్రస్తుతం బైడెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అధ్యక్షుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తారని శ్వేతసౌధం తెలిపింది.

"""/" / మరోవైపు బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి ఎక్కేటప్పుడు బైడెన్ మాస్క్ ధరించి లేరు.అలాగే విలేకరులతో మాట్లాడే సమయంలోనూ తాను బాగానే ఉన్నట్లుగా అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఇప్పటికే అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వస్తున్న వేళ.నిన్న జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే తాను అధ్యక్ష బరిలోంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని తెలిపారు.

ఈ వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే బైడెన్ కరోనా బారినపడటం అమెరికన్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..