అమెరికా : నా పాలనపై నెగిటివ్ కవరేజ్ వద్దు.. మీడియాపై శివాలెత్తిన జో బైడెన్
TeluguStop.com
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కారు.
తాను హాలిడే వెకేషన్‌కు వెళ్లినప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థపై నెగిటివ్ కవరేజ్( Negative Coverage ) చేశారంటూ ఆయన మండిపడ్డారు.
క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకునేందుకు గాను జో బైడెన్ .క్యాంప్ డేవిడ్‌కు బయల్దేరుతుండగా.
దేశ ఆర్ధిక వ్యవస్ధ, దీనిపై మీ వైఖరి ఏంటంటూ ఓ విలేకరి ప్రశ్నించారు.
అంతా బాగుంది, మీరు కూడా చూడండి అంటూ సమాధానమిచ్చిన అధ్యక్షుడు.ఆ వెంటనే సరైన మార్గంలో కవరేజ్ చేయాలంటూ మీడియాకు హితవు పలికారు.
అయితే మీడియాపై( Media ) బైడెన్ నోరు పారేసుకోవడం ఇదే తొలిసారి కాదు.
అనేక సానుకూల అంశాల కంటే తన పరిపాలనపై నెగిటివ్ న్యూస్‌పైనే మీడియా దృష్టి పెడుతోందని ఆయన ఫైర్ అయ్యారు.
అమెరికన్లలో ఆయన అప్రూవల్ రేటింగ్ చారిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరుకోవడాన్ని బైడెన్ తట్టుకోలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పోల్స్ ప్రకారం జో బైడెన్ ఆర్ధిక వ్యవస్ధను సరిగా నిర్వహించలేకపోతున్నారట. """/" /
ఫాక్స్ న్యూస్ పోల్ ప్రకారం కేవలం 14 శాతం మంది అమెరికన్లు మాత్రమే జో బైడెన్ ఆర్ధిక విధానాలు దేశానికి మంచి చేశాయని విశ్వసిస్తున్నారు.
కానీ 46 శాతం మంది మాత్రం బైడెన్ పాలన ఆర్ధికంగా తమను దెబ్బతీసిందని పేర్కొన్నారు.
పోల్‌లో 61 శాతం మంది డెమొక్రాట్‌లు( Democrats ) 93 శాతం మంది రిపబ్లికన్లు,( Republicans ) 85 శాతం మంది స్వతంత్రులు కలిసి సంయుక్తంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ( America Economy ) తీవ్ర ఇబ్బందుల్లో వుందని పేర్కొనడం గమనార్హం.
ఇకపోతే.దేశ ప్రజలకు జో బైడెన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే శాంతా క్లాజ్ ఆచూకీ తెలుసుకోవాలనుకునే యువ అమెరికన్లతో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాట్లాడారు.
"""/" /
కాగా.అధ్యక్షుడిగా బైడెన్ అప్రూవల్ రేటింగ్( Joe Biden Approval Rating ) అత్యల్ప స్థాయికి చేరుకుందని సర్వే తెలిపింది.
మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డెమొక్రాట్ సర్కిల్స్‌లో ఈ సర్వే భయాందోళనలు కలిగిస్తోంది.
థర్డ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్ధులను పరిగణనలోనికి తీసుకుంటే వారంతా కలిసి 17 శాతం మద్ధతు పొందగా.
ట్రంప్( Donald Trump ) 31 నుంచి 36 పాయింట్ల మధ్య పొందారు.
బైడెన్ రెండవసారి అధ్యక్షుడిగా వుండాలా , వద్దా అని అడిగితే ఆయన బరిలో నుంచి తప్పుకోవాలనే వాదనలు పెరుగుతున్నాయి.
ఇందుకు ప్రధాన కారణం బైడెన్ వయసు.ఎన్నికలు జరిగే సమయానికి బైడెన్‌కు 81 ఏళ్లు వస్తే.
రెండవసారి అధ్యక్షుడిగా గెలిచి దిగిపోయేనాటికి ఆయనకు 86 ఏళ్లు నిండుతాయి.దీనికి తోడు కాలిఫోర్నియాలోని పన్ను ఆరోపణలపై బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై నేరారోపణలు .
అధ్యక్షుడికి అవకాశాన్ని మరింత క్లిష్టతరం చేసింది.
నీతులు చెప్పడమే కాదు పాటించాలిగా.. అనంత్ శ్రీరామ్ ఓల్డ్ సాంగ్స్ లిరిక్స్ పై విమర్శలు?