జాతీయ ఆర్ధిక బృందాన్ని పునర్వ్యవస్థీకరించిన జో బైడెన్.. భరత్ రామమూర్తికి రెన్యూవల్..!!
TeluguStop.com
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో తన జాతీయ ఆర్ధిక బృందాన్ని పునర్వ్యవస్థీకరించారు.
ఈ జాబితాలో భారత సంతతికి చెందిన భరత్ రామమూర్తికి మరోసారి అవకాశం కల్పించారు బైడెన్.
లేల్ బ్రెయినార్డ్.నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని, అలాగే జారెడ్ బెర్న్ స్టెయిన్.
కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ చైర్‌గా నామినేట్ అయినట్లు వైట్‌హౌస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
భరత్ రామమూర్తి.నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా , స్ట్రాటజిక్ ఎకనామిక్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్‌గా కొనసాగుతారని శ్వేతసౌధం ప్రకటించింది.
అలాగే ప్రస్తుతం కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్‌లో మెంబర్‌గా పనిచేస్తున్న హీథర్ బౌషేకు కూడా మరోసారి అవకాశం కల్పించారు బైడెన్.
ఆయన అమెరికా కేబినెట్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గానూ సేవలందించారు.ప్రస్తుతం కార్మిక శాఖలో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేస్తున్న జోయెల్ గాంబుల్‌ను కూడా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు బైడెన్ .
"""/"/
డిసెంబర్ 2020లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ రిఫార్మ్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా భరత్ రామమూర్తిని నియమించారు బైడెన్.
గతంలో రూజ్‌వెల్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో కార్పోరేట్ పవర్ ప్రోగ్రామ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు రామమూర్తి.
గతేడాది ఏప్రిల్‌లో , సెనేట్ మైనారిటీ నేత చక్ షుమెర్ చేత "CARES" చట్టం కోసం కాంగ్రెషనల్ ఓవర్‌సైట్ కమీషన్‌లో పనిచేసేందుకు నియమితులయ్యారు.
"""/"/
2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో సెనేటర్ ఎలిజబెత్ వారెన్‌కు ఆర్ధిక సలహాదారుగానూ రామమూర్తి సేవలందించారు.
అలాగే ఆమె సెనేట్ కార్యాలయంలో బ్యాంకింగ్, ఆర్ధిక విధానానికి సీనియర్ న్యాయవాదిగానూ వ్యవహరించారు.
మసాచుసెట్స్‌లో జన్మించిన భరత్ రామమూర్తి.హార్వర్డ్ కాలేజీ, యేల్ లా స్కూల్‌లో చదువుకున్నారు.
ఈయన తల్లిదండ్రులు భారత్‌లోని తమిళనాడు నుంచి అమెరికాకు వలస వచ్చారు.ప్రముఖ లాయర్ పైజ్ అమ్మోన్స్‌ను పెళ్లాడారు భరత్ రామమూర్తి.
ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.
గురుపత్వంత్ పన్నూన్‌కు షాక్ .. ఎస్ఎఫ్‌జేపై ఐదేళ్ల నిషేధం , హోంశాఖ నిర్ణయానికి ఆమోదం