అమెరికా: భారత సంతతి లాయర్‌ విజయ్ శంకర్‌కు కీలక పదవి.. !!

దేశంలోని ఫెడరల్ , స్థానిక కోర్టులకు జ్యూడీషియల్ నామినీలకు సంబంధించి 23వ రౌండ్ లో భారతీయ అటార్నీ విజయ్ శంకర్‌ను అదృష్టం వరించింది.

ఆయనతో కలిపి మరో ఏడుగురిని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.

డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (డీసీ) కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అనేది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి అత్యున్నత న్యాయస్థానం.

1970లో స్థాపించబడిన ఈ కోర్ట్.రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి సమానం.

ఇకపోతే.ప్రస్తుతం న్యాయశాఖ క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సిలర్‌‌గా, అప్పిలేట్ సెక్షన్ డిప్యూటీ చీఫ్‌గా విజయ్ శంకర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

2012 నుంచి న్యాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న శంకర్.అంతకు ముందు వాష్టింగ్టన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

మేయర్ బ్రౌన్, ఎల్ఎల్‌సీ, కోవింగ్టన్ అండ్ బర్లింగ్, ఎల్ఎల్‌సీల తరఫున పలు కేసులను వాదించారు.

న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ సెకెండ్ సర్క్యూట్ జడ్జ్ చెస్టర్ జే స్ట్రాబౌ వద్ద క్లర్క్‌గా ఉన్నారు.

న్యాయశాస్త్రంలో డ్యూక్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, వర్జీనియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తిచేశారు.

అనంతరం వర్జీనియా లా రివ్యూకి నోట్స్ ఎడిటర్‌గా విజయశంకర్ పనిచేశారు. """/" / అయితే విజయ్ శంకర్ ఈ పాటికే జడ్జిగా మంచి స్థాయిలో వుండాల్సి వుంది.

కానీ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను పున: సమీక్షిస్తూ వస్తున్న బైడెన్ ఇప్పటికే కొన్నింటిని రద్దు చేయగా, మరికొన్ని వాయిదా వేశారు.

ఈ క్రమంలో విజయ్ శంకర్‌ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.వాషింగ్టన్‌లోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు జడ్జిగా నామినేట్ చేశారు.

అధికారం నుంచి దిగిపోవడానికి రెండు వారాల ముందే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, విజయ్ శంకర్‌ను జడ్జిగా నియమించడానికి ట్రంప్ చేసిన ప్రతిపాదనను జో బైడెన్ గతేడాది ఫిబ్రవరిలో రద్దు చేశారు.

అధ్యక్షుడిగా దిగిపోవడానికి కొద్ది నెలల ముందు ట్రంప్ చేపట్టిన 32 నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఉపసహరించే నోటిఫికేషన్‌ను బైడెన్ సెనేట్‌కు పంపారు.

ఈ లిస్ట్‌లో భారతీయ అమెరికన్ విజయ్ శంకర్ పేరు కూడా ఉండటం గమనార్హం.

ఈ అంశంలో సెనేట్ ఆమోదం లభిస్తే, కొలంబియా కోర్ట్ ఆఫ్ అపీల్స్‌కు విజయ శంకర్ జడ్జి అవుతారని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు.

మోహన్ బాబు పై పరోక్షంగా కామెంట్స్ చేసిన చిరు.. స్పందించిన మనోజ్?