Joe Biden : గాజా మెక్సికో బోర్డర్‌లో వుందట .. మరోసారి నవ్వులపాలైన జో బైడెన్ , మీ మెమొరీ పవర్ సూపర్ అంటూ ట్రోలింగ్
TeluguStop.com
వయోభారం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ).
మొన్నామధ్య కమలా హారీస్‌ను ప్రెసిడెంట్ హ్యారీస్ అంటూ టంగ్ స్లిప్పయ్యారు .అంతేకాదు మంత్రుల పేర్లు, వారి హోదాలను సైతం చెప్పలేక తడబడ్డారు.
తర్వాత అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన.రష్యా - ఉక్రెయిన్( Russia - Ukraine ) సమస్య గురించి ప్రస్తావించారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ అనాల్సిందిపోయి ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి పరువు పొగొట్టుకున్నారు.ఆ తర్వాత చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే సందర్భంగా సెనేట్ మెజారిటీ నేత చక్ షుమెర్( Senate Majority Leader Chuck Schumer ) అక్కడున్న వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు.
బైడెన్‌కి కూడా ఇచ్చి, పక్కకు జరిగారు.సరిగ్గా ఇదే సమయంలో బైడెన్ మతిమరుపు బయటపడింది.
అప్పటికే తనకు షుమెర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం మరిచిపోయిన పెద్దాయన.మరోసారి కరచాలనం కోసం చేయి ఇచ్చారు.
అప్పట్లో ఈ ఘటన వైరల్ అయ్యింది.ఇలా ఒకటి కాదు రెండు కాదు.
బైడెన్ అభాసుపాలైన సందర్భాలు కోకొల్లలు. """/" /
తాజాగా మరోసారి బైడెన్ ఏకంగా మీడియా ముందు అడ్డంగా దొరికిపోయారు.
మెక్సికో ( Mexico )సరిహద్దుల్లో గాజా( Gaza ) వుందంటూ ఓ ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించడంతో విలేకర్లు షాక్‌కు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే.అమెరికా రహస్య పత్రాలను జో బైడన్ తన సొంత ఇంట్లో పెట్టుకోవడంపై కౌన్సిల్ రాబర్ట్ హుర్ నివేదిక ఇచ్చారు.
ఈ సందర్భంగా బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు వ్యక్తం చేశారు.అధ్యక్షుడు జ్ఞాపకశక్తి తక్కువ వున్న వృద్ధుడు అని అభివర్ణించారు.
దీనికి జో బైడెన్ కౌంటరిచ్చారు.నాకన్ని చాలా బాగా గుర్తుంటాయి.
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎన్నో పనులు చేశానని అధ్యక్షుడు పేర్కొన్నారు.
"""/" /
ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజాకు మానవీయ సాయం పంపడంపై బైడెన్‌ను విలేకర్లు ప్రశ్నించారు.
దీనికి అధ్యక్షుడు బదులిస్తూ .ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్ధుల్ ఫతా ఎల్ సిసిని ( Abdul Fatah El Sisi )మెక్సికో అధినేతగా పేర్కొన్నారు.
ఎల్ సిసి సరిహద్దులు తెరిచి (గాజా సరిహద్దులు) మానవతా సాయం పంపేందుకు ఇష్టపడలేదని, కానీ తాను ఆయనతో మాట్లాడి ఒప్పించానని బైడెన్ చెప్పారు.
దీంతో అధ్యక్షుడు ఏం మాట్లాడారో అర్ధం కాక మీడియా ప్రతినిధులు తలగొక్కున్నారు.ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నేపథ్యంలో బైడెన్ మాట్లాడిన క్లిప్స్ రిపబ్లికన్ పార్టీ చేతికి చిక్కాయి.
దీంతో ఆ పార్టీ మద్ధతుదారులు ఆయనను ఓ ఆట ఆడుకుంటున్నారు.
చిరంజీవి విశ్వంభర సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ కొడుతాడా..?