డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం.. మాజీ అధ్యక్షుడికి బైడెన్ ఫోన్, ఏం చెప్పారంటే ?

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump )పై హత్యాయత్నం నేపథ్యంలో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది.

వెంట్రుకవాసిలో ట్రంప్ అగంతకుడి బారి నుంచి తప్పించుకున్నారు.ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి పరామర్శించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ట్రంప్ క్షేమంగా ఉన్నారని.బైడెన్( Joe Biden ) తెలపగా, తనకు ఫోన్ చేసినందుకు గాను మాజీ అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు.

"""/" / అధ్యక్షుడు ఇప్పుడే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారని, ఇద్దరూ యోగక్షేమాలు పంచుకున్నారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ ఓ ఈమెయిల్ పేర్కొంది.

మరోవైపు.ఫిలడెల్ఫియాలో జరిగిన నేషనల్ హెచ్‌బీసీయూ వీక్ కాన్ఫరెన్స్‌లో జో బైడెన్ మాట్లాడుతూ అమెరికాలో రాజకీయ హింస, హత్యాయత్నాలను ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

"""/" / అంతకుముందు ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జో బైడెన్, కమలా హారిస్‌( Joe Biden, Kamala Harris ) లు తనపై రెచ్చగొట్టే పదజాలం వాడటం వల్లే నిందితుడు తనను చంపాలని అనుకున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.

బైడెన్, హారిస్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే ముప్పని, తానూ అలాంటి మాటలు మాట్లాడగలనని.కానీ తనకు ఆ అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

కొన్ని మీడియా సంస్థలు సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని మాజీ అధ్యక్షుడు మండిపడ్డారు.

అంతలోనే జో బైడెన్ ఆయనను పరామర్శిస్తూ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.కాగా.

రెండ్రోజుల క్రితం ఫ్లోరిడా( Florida )లోని పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా.

ఓ అగంతకుడు తుపాకీతో లోపలికి ప్రవేశించాడు.అతనిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమై కాల్పులు జరిపారు.

దీంతో అగంతకుడు కారులో పారిపోయేందుకు యత్నించగా.పోలీసులు ఛేజ్ చేసి అతనిని పట్టుకున్నారు.

నిందితుడిని ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.ట్రంప్‌ను హత్య చేసేందుకే నిందితుడు వచ్చినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్ధారించింది.

పట్టపగలు మహిళను అసభ్యంగా తాకిన నీచుడు.. వీడియో చూస్తే రక్తం మరుగుద్ది!