రేపే ప్రమాణ స్వీకారం .. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌‌కు చేరుకున్న ట్రంప్

రేపే ప్రమాణ స్వీకారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌‌కు చేరుకున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

రేపే ప్రమాణ స్వీకారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌‌కు చేరుకున్న ట్రంప్

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.దీంతో ట్రంప్ తన కుటుంబంతో కలిసి రాజధాని వాషింగ్టన్ డీసీకి( Washington DC ) చేరుకున్నారు.

రేపే ప్రమాణ స్వీకారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌‌కు చేరుకున్న ట్రంప్

గడ్డకట్టే చలి, అత్యంత శీతల పరిస్ధితులు, వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా ప్రమాణ స్వీకారాన్ని ఆరు బయట కాకుండా లోపలికి మార్చారు.

కాపిటల్ రోటుండాలో( Capitol Rotunda ) డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

"""/" / శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ట్రంప్ తన సతీమణి మెలానియా,( Melania ) వారి కుమారుడు బారన్‌తో( Barron Trump ) కలిసి పామ్ బీచ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్ డీసీలోని డల్లెస్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ట్రంప్ కుమార్తె ( Ivanka Trump ) ఆమె భర్త జారెడ్ కుష్నర్, వారి పిల్లలు మరో ప్రత్యేక విమానంలో రాజధానికి బయల్దేరారు.

అలాగే ట్రంప్ కుమారుడు ఎరిక్ , కోడలు లారాలు తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ జెట్‌లో వాషింగ్టన్‌కు చేరుకున్నారు.

శనివారం రాత్రి వర్జీనియాలోని తన గోల్ఫ్ క్లబ్‌లో రిసెప్షన్, ఫైర్ వర్క్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇక్కడ జరిగే విందు కోసం దాదాపు 500 మంది అతిథులను ఆహ్వానించారు. """/" / క్యాపిటల్ రోటుండాలో ప్రసంగించిన తర్వాత ట్రంప్.

క్యాపిటల్ వన్ అరీనాలో తన మద్ధతుదారులతో కలిసి ఇండోర్ పరేడ్‌లో పాల్గొంటారు.ఆదివారం ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికలో అమరులైన సైనికులకు నివాళులర్పించనున్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్ధనలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో( Joe Biden ) ప్రైవేట్ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొంటారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి పలువురు దేశాధినేతలు, రాయబారులు, అమెరికా మాజీ అధ్యక్షులు కార్పోరేట్ దిగ్గజాలు, సినీ, రాజకీయ, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్.. AIతో టీచర్ చేసిన పనికి ప్రపంచం మొత్తం ఫిదా!