యూఎస్ సెకండ్ లేడీ ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసల వర్షం

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ .( President Donald Trump ) ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్( JD Vance ) సతీమణి ఉషా చిలుకూరిపై( Usha Chilukuri ) ప్రశంసల వర్షం కురిపించారు.

వీలుంటే గనుక ఉషను నా ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేసేవాడినని అన్నారు.సోమవారం నాడు ఆమె భర్త జేడీ వాన్స్ అమెరికాకు 50వ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఉషా చిలుకూరి .

తొలి భారత సంతతి, తొలి హిందూ సెకండ్ లేడీగా చరిత్రలో నిలిచారు.సోమవారం గులాబీ రంగు కోటు ధరించి.

ఒక చేతిలో బైబిల్‌ను, మరో చేతిలో కుమార్తె మిరాబెల్ రోజ్‌ను( Mirabel Rose ) ఉష పట్టుకున్నారు.

వాన్స్ తన ఎడమ చేతిని మత గ్రంథంపై ఉంచి ప్రమాణ స్వీకారం చేశారు.

ఉషకు గురువుగా ఉన్న సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ .జేడీ వాన్స్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు.

గతంలో ఉష.సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు కవనాగ్, జాన్ రాబర్ట్స్ వద్ద క్లర్క్‌గా పనిచేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రుమన్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆల్బెన్ బార్ల్కీ భార్య జేన్ హాడ్లీ బార్ల్కీ (38) తర్వాత అత్యంత పిన్న వయస్కురాలైన సెకండ్ లేడీగా ఉష నిలిచారు.

"""/" / ట్రంప్ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత రిపబ్లికన్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉష.

చాలా అందంగా ఉన్నారని ప్రశంసించారు.అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు శ్రమించిన తన ప్రచార బృందాన్ని , పార్టీ శ్రేణులపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.

తాను కొంతకాలంగా జేడీని చూస్తున్నానని.అతను గొప్ప సెనేటర్ అని ఉపాధ్యక్షుడిని ప్రశంసించారు.

ఉష - వాన్స్‌లు అందమైన జంట అని ట్రంప్ కొనియాడారు. """/" / భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్లూరు .

ఉషా చిలుకూరి తల్లిదండ్రుల పూర్వీకుల గ్రామం.కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌డియాగో ప్రాంతంలో ఉషా బాల్యం గడిచింది.

యేల్ లా స్కూల్‌లో ఉండగానే ఉషా, జేడీ వాన్స్‌ల మధ్య పరిచయం జరిగింది.

ఇది ప్రేమగా మారి, 2014లో కెంటుకీలో వివాహం చేసుకున్నారు.వీరి పెళ్లి హిందూ సంప్రదాయంలో జరగడం విశేషం.

వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు.భర్తకు చేదోడు వాదోడుగా ఆయన విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు ఉష.

పట్టపగలు జలపాతం ఒడ్డున దెయ్యాలు ప్రత్యక్షం.. వీడియో చూస్తే జడుసుకుంటున్నారు..