అమెరికా: మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌కు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.మంగ‌ళ‌వారం ఓ వ్యక్తిగత కార్య‌క్ర‌మానికి హాజ‌రైన క్లింట‌న్.

స్వ‌ల్ప అనారోగ్యానికి గురైన‌ట్లు త‌న సిబ్బందికి తెలిపారు.దీంతో వారు ఆయనను చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం క్లింట‌న్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఇర్విన్ వైద్య వర్గాలు తెలియజేశాయి.

యూరిన్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్లే క్లింట‌న్ అనారోగ్యానికి గుర‌య్యార‌ని, ఇది వ‌య‌సు పైబ‌డిన వారిలో సాధారణంగా వ‌చ్చే స‌మ‌స్యే అని వైద్యులు స్ప‌ష్టం చేశారు.

డాక్ట‌ర్ అల్పేస్ అమీన్, డాక్ట‌ర్ లిసా బార్‌డాక్ నేతృత్వంలో క్లింట‌న్‌కు చికిత్స కొన‌సాగుతోంది.

క్లింట‌న్‌కు 2004లో బైపాస్ హార్ట్ స‌ర్జ‌రీ నిర్వ‌హించారు.2010లో రెండు స్టెంట్లు కూడా వేశారు.

కానీ ఆయ‌న‌కు ఎలాంటి గుండె స‌మ‌స్య కానీ, కొవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ కానీ లేద‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు.

1993 నుంచి 2001 మ‌ధ్య అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా బిల్ క్లింట‌న్ సేవ‌లందించారు.

క్లింటన్ పూర్తి పేరు విలియం జెఫెర్సన్ బ్లైత్ III .1946 ఆగస్టు 19న అర్కాన్సాస్‌లోని హోప్‌లో వున్న జూలియా జెస్టర్ హాస్పిటల్‌లో ఆయన జన్మించారు.

ఆయన జననానికి మూడు నెలల ముందు క్లింటన్ తండ్రి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు.

స్కాలర్‌షిప్‌ల సాయంతో విద్యాభ్యాసం చేసిన క్లింటన్.జార్జియా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు.

1964-65 మధ్యకాలంలో క్లాస్ ప్రెసిడెంట్‌గా ఆయన గెలుపొందారు.అనంతరం ఆర్కాన్సస్ సెనేటర్ జే విలియమ్ ఫుల్‌బ్రైట్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేశారు.

అనంతరం డెమొక్రాటిక్ పార్టీ సిద్దాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన రాజకీయాలలో ప్రవేశించారు.ఈ నేపథ్యంలోనే క్లింటన్ 1978లో ఆర్కాన్సస్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.

తిరిగి 1983లో గవర్నర్‌గా ఎన్నికైన ఆయన 1992 వరకు ఆ పదవిలో కొనసాగారు.

1993 నుంచి 1997 వరకు తొలిసారి అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించారు.అనంతరం 1997లో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

"""/"/ ఇక మోనికా లెవెన్‌స్కీ స్కాండల్‌లో బిల్ క్లింటన్‌పై అభిశంసన తీర్మానం పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

తనకు మోనికా లెవెన్‌స్కీతో అక్రమ సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ బిల్‌క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది.

అభిశంసన తీర్మానంకు ముందు జరిగే ప్రక్రియలో 228 మందిలో 206 మంది క్లింటన్‌పై విచారణ జరపాలంటూ కోరారు.

1999లో విచారణ తర్వాత సెనేట్‌లో బిల్ క్లింటన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా.

మూడింట రెండోవంతు మెజార్టీ రాలేదు.దీంతో క్లింటన్ అధ్యక్షుడిగా కొనసాగారు.

రూ.10వేల బడ్జెట్లో ఐటెల్ S24 స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!