పెళ్లైన కొన్ని గంటలకే మరణించిన ప్రముఖ సింగర్.. భార్య కన్నీళ్లు పెడుతూ?

ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో పెళ్లి కూడా ఒకటి.పెళ్లి తర్వాత సంతోషంగా జీవనం సాగించాలని చాలామంది భావిస్తారు.

అలా జీవనం సాగించడం కోసం ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకుంటారు.అయితే విధిరాతను ఎవ్వరూ మార్చలేరు.

ప్రముఖ సింగర్ పెళ్లైన కొన్ని గంటలకే మృతి చెందడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

చనిపోయిన ఈ ప్రముఖ సింగర్ పేరు జేక్ ఫ్లింట్.కొత్త జీవితాన్ని ఎన్నో ఆశలతో మొదలుపెట్టాలని భావించిన ఈ జంటకు విధి విచిత్రమైన పరిస్థితులను కల్పించింది.

బ్రెండ్ విల్సన్ ను జేక్ ఫ్లింట్ పెళ్లి చేసుకున్నారు.అయితే పెళ్లైన కొన్ని గంటలకే జేక్ ఫ్లింట్ మృతి చెందడం హాట్ టాపిక్ అవుతోంది.

జేక్ ఫ్లింట్ మృతి ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.ఎన్నో హిట్ ఆల్బమ్స్ తో జేక్ ఫ్లింట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

లైవ్ ఈవెంట్ల ద్వారా ఈ సింగర్ మంచి పేరును సంపాదించుకున్నారు. """/"/ ప్రముఖ ప్రచారకర్తలలో ఒకరైన క్లిఫ్ డోయల్ జేక్ ఫ్లింట్ మృతి గురించి సమాచారం అందించారు.

మరణ వార్త తెలిసిన వెంటనే అతని భార్య రోదిస్తున్నారని తెలుస్తోంది.ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదని తెలుస్తోంది.

జేక్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. """/"/ జేక్ మొదటి ఆల్బమ్ 2016 సంవత్సరంలో రిలీజైంది.

జేక్ మరణ వార్త తెలిసి ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

1985 సంవత్సరంలో అమెరికాలో జన్మించిన జేక్ ఫ్లింట్ చిన్న వయస్సులోనే మృతి చెందడంతో ఆయన ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.

ఈ మధ్య కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖుల మరణాలు ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి.

కన్నీళ్లు పెట్టించే ఘటన.. కారు కింద నలిగిన లేగదూడ.. వెంబడించిన ఆవులు?