ముగిసిన యూఎస్ ఓపెన్ టైటిల్… విజేతలు వీరే…!

ముగిసిన యూఎస్ ఓపెన్ టైటిల్… విజేతలు వీరే…!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో క్రీడా రంగం పూర్తిగా కుదేలు అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ముగిసిన యూఎస్ ఓపెన్ టైటిల్… విజేతలు వీరే…!

ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ఎన్నో అంతర్జాతీయ క్రీడా సంబరాలు కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డాయి.

ముగిసిన యూఎస్ ఓపెన్ టైటిల్… విజేతలు వీరే…!

మరి కొన్ని పూర్తిగా రద్దయ్యాయి కూడా.ఇక గత రెండు నెలల నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో తిరిగి మరలా క్రీడా సంబరాలు మొదలయ్యాయి.

అయితే కేవలం ఎటువంటి క్రీడాభిమానులు లేకుండానే క్రీడలు కొనసాగుతున్నాయి.ప్రతి ఏటా అమెరికాలో జరిగే యూఎస్ ఓపెన్ ఎలాంటి అనివార్య సంఘటనలు జరగకుండా ముగిసింది.

ఇందుకు సంబంధించి విన్నర్స్, రన్నర్స్ విషయానికి వస్తే.ముందుగా పురుషుల వివరాలు చూస్తే హోరాహోరీగా సాగిన తుది పోరులో డోమినిక్ థీమ్ అద్భుత విజయం సాధించాడు.

అయితే సిరీస్ లో అనూహ్యంగా వరల్డ్ నెంబర్ వన్ జొకోవిచ్ నిష్క్రమణతో హాట్ ఫేవరెట్ గా మారిన రెండో సీడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన థీమ్ అతని పై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ ఎట్టకేలకు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి ఆస్ట్రియా దేశస్తుడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇకపోతే ఫైనల్లో మాత్రం తొలి రెండు సెట్లలో వెనుకబడిన ఆయన అనూహ్యంగా పుంజుకుని తర్వాత మూడు సీట్లను సొంతం చేసుకొని యూఎస్ ఓపెన్ టైటిల్ ని ముద్దాడాడు.

ఫైనల్ మ్యాచ్ లో జ్వెరవ్ పై టీం 2 -6, 4 - 6, 6 - 4, 6 - 3, 7 - 6 లతో టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.

"""/"/ ఇక అలాగే మహిళల విషయానికి వస్తే సింగిల్స్ లో నాలుగో సిడెడ్ కి చెందిన ఒసాకా విజేతగా నిలిచింది.

ఒసాకా ఫైనల్లో విక్టోరియా అజరెంకా పై 1 - 6, 6 - 3, 6 - 3 తో టైటిల్ ను ఎగురేసుకెళ్లింది.

ఇక ఇందులో విజేతగా నిలిచిన ఓసాకా కు 30 లక్షల డాలర్లు, అలాగే రన్నరప్ గా నిలిచిన విక్టోరియా అజరెంకా కు 15 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా లభించాయి.

రూ.2.6 కోట్లు పెట్టి ఫెరారీ కొన్నాడు.. గంట తిరిగేలోపే అగ్నికి ఆహుతి.. ఎక్కడంటే..