మొన్న మిచిగాన్‌లో .. నేడు టెక్సాస్‌లో, అమెరికాలో రోజుల వ్యవధిలో మళ్లీ కాల్పులు

అమెరికాలో రోజుల వ్యవధిలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎప్ పాసో ప్రాంతంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో బుధవారం సాయంత్రం ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.ఇకపోతే.

రెండ్రోజుల క్రితం ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లోకి చొరబడ్డ ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

కాల్పుల శబ్ధం వినిపించగానే.భయాందోళనకు గురైన విద్యార్ధులు, సిబ్బంది తమ తమ గదుల్లోకి పారిపోయి బిక్కుబిక్కుమంటూ గడిపారు.

"""/" / సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అయితే అప్పటికే దుండగుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు.దీంతో ఉన్మాది కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కాల్పుల ఘటన నేపథ్యంలో రెండు రోజుల పాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలన రద్దు చేశారు.

మరోవైపు దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తమ సహచరులు విద్యార్ధులు, అధ్యాపకులు నివాళులర్పిస్తున్నారు.

"""/" / సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించి రెండు ఫోటోలను విడుదల చేశారు పోలీసులు.

బేస్‌బాల్ క్యాప్ పెట్టుకుని, జాకెట్, జీన్స్ ప్యాంట్ ధరించిన దుండగుడు తన ముఖం కనిపించకుండా నలుపు రంగు మాస్క్ ధరించాడు.

కాగా.గతేడాది మేలో 19 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లను పొట్టనబెట్టుకున్న టెక్సాస్ స్కూల్ కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచిన సంగతి తెలిసిందే.

అప్పుడు హనుమాన్ ఇప్పుడు కల్కి.. 50 రోజుల బొమ్మతో ప్రభాస్ మళ్లీ చరిత్ర సృష్టించారుగా!