యూఎస్ నేవీ: తలపాగా ధరించేందుకు అనుమతి.. సవాలక్ష కండీషన్లు, సిక్కు అధికారి మనస్తాపం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

చివరికి యూఎస్ రక్షణ దళాల్లోనూ ఇండో అమెరికన్ల ప్రాబల్యం నానాటికీ పెరుగుతోంది.అయితే కొన్ని చోట్ల వివక్ష కూడా అలాగే వుంది.

సహజంగానే భారతీయులు తమ ఆచార వ్యవహారాలను ప్రాణం కంటే మిన్నగా భావిస్తారు.వీటిని పాటించే విషయంలో ఏ మాత్రం రాజీపడరు.

కానీ, అమెరికా నిబంధనలు భారతీయ సమాజంలోని ఆయా మతాలు, ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా వుంటున్నాయి.

ఇందులో ఒకటి సిక్కులు తలపాగా ధరించి విధులకు హాజరవ్వడం.భారత ప్రభుత్వం, ప్రవాస భారతీయులు, సిక్కు పెద్దల కృషి ఫలితంగా అమెరికాలోని కొన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న సిక్కులు తలపాగా ధరించి విధులకు హాజరయ్యేలా అనుమతులు లభించాయి.

ఈ నేపథ్యంలో భారతీయ సిక్కు అధికారి అరుదైన ఘనత సాధించాడు.246 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా నౌకాదళంలో తలపాగా ధరించి విధులకు హాజరయ్యేందుకు 26 ఏళ్ల సుఖ్‌బీర్ టూర్‌కు అనుమతి లభించింది.

అయితే అది సవాలక్ష కండీషన్లతో వుండటంతో ఆయన న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నారు.

భారత్ నుంచి వలస వచ్చిన తల్లిదండ్రుల కుమారుడైన సుఖ్‌బీర్ వాషింగ్టన్‌, ఓహియోలలో పెరిగారు.

2017లో అమెరికా నేవీలో చేరారు. """/"/ యూఎస్ నౌకాదళం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం.

ఆయన సాధారణ విధుల్లో రోజువారీ దుస్తులతో తలపాగా ధరించవచ్చని.కానీ వార్ జోన్‌లో వున్నప్పుడు, అధికార వేడుకలు, కార్యక్రమాల్లో మాత్రం తప్పనిసరిగా యూనిఫాంతో పాటు అధికారిక టోపీ ధరించాలని తెలిపింది.

అయితే తనకు నిర్బంధంతో కూడిన అనుమతిపై తీవ్ర అసంతృప్తికి లోనైన సుఖ్‌బీర్.యూఎస్ మెరైన్ కార్ప్స్ కమాండెంట్‌ నిర్ణయంపై అప్పీల్‌ చేశారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో ప్రచురించింది.

తనకు పూర్తి స్థాయిలో తలపాగా ధరించేందుకు అనుమతులు లభించని పక్షంలో మెరైన్ కార్ప్స్‌పై దావా వేస్తానని చెప్పినట్లుగా వెల్లడించింది.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాల్లో దాదాపు 100 మంది సిక్కులు.

పూర్తిగా గడ్డాలు, తలపాగా ధరించే విధులు నిర్వర్తిస్తున్నారు.

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పై వైసీపీ సంచలన ఆరోపణలు