యూఎస్: 6 నెలల కోమా నుంచి లేచిన వ్యక్తి.. హాస్పటల్ బిల్లు చూసి షాక్..!
TeluguStop.com
ఈ రోజుల్లో ఆసుపత్రి బిల్లులు కట్టడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది.లాస్ వేగాస్‌కు చెందిన జాన్ పెన్నింగ్టన్( John Pennington ) అనే వ్యక్తికి కూడా హాస్పిటల్ బిల్లులు( Hospital Bills ) భారీ షాకిచ్చాయి.
జాన్ 30 ఏళ్ల వయసులో ఒక కారు ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు.
కోమా నుంచి బయటపడిన తర్వాత కూడా అతని కష్టాలు తీరలేదు.రెడిట్‌లో జాన్ పంచుకున్న సమాచారం ప్రకారం, ఆసుపత్రిలో ఉండటానికి అతను 2.
5 మిలియన్ డాలర్లు (సుమారు 20 కోట్ల రూపాయలు) బిల్లు చెల్లించాల్సి వచ్చింది.
అంతేకాకుండా, నెవాడ కమ్యూనిటీ ఎన్‌రిచ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో రెండు రీహాబ్ చికిత్సలకు జాన్ ఎక్స్‌ట్రాగా చెల్లించాల్సి వచ్చింది.
"""/" /
జాన్ 2015లో ఒక రోజు ఉదయం లేచి పనికి వెళ్ళాలి అనుకున్నాడు.
కానీ అతని తలకు దెబ్బ తగిలింది.కట్ చేస్తే ఆస్పత్రిలో వచ్చి పడ్డాడు.
ఆయన దగ్గరకు వచ్చిన నర్స్‌ను చూసి, "బాత్రూమ్‌కి వెళ్ళవచ్చా?" అని అడిగితే, ఆ నర్స్ కంటి నిండా నీళ్లు పెట్టుకుని గది నుంచి పరుగున వెళ్ళిపోయింది.
కొన్ని నిమిషాల తర్వాత తిరిగి వచ్చి జాన్‌తో క్షమాపణ చెప్పింది.ఆ నర్స్ జాన్‌తో, "మీరు గత 6 నెలలు కోమాలో ఉన్నారు.
మీకు చాలా తీవ్రమైన తల వెన్నుముక గాయం అయింది.డాక్టర్లు మీరు మళ్ళీ లేచాక ఏమీ చేయలేరు అని అనుకున్నారు" అని చెప్పింది.
దాంతో అతను షాక్ అయ్యాడు.తనకి ఇలా జరిగిందని ఆరు నెలలు కోమా( Coma )లో ఉన్నాననే విషయం అప్పుడే తెలిసింది.
"""/" /
జాన్ తన చికిత్స ఖర్చులను భరించడానికి గో ఫండ్‌మీ పేజీని సృష్టించాడు.
కానీ అది సరిపోకపోవడంతో తన న్యాయవాది సహాయం తీసుకున్నాడు.జాన్‌కు సహాయం చేయడానికి అతని న్యాయవాది సిద్ధంగా ఉన్నాడు.
అన్ని వైద్య ఖర్చులు చెల్లించిన తర్వాత, జాన్ ఊపిరి పీల్చుకున్నాడు.జాన్ సోషల్ మీడియాలో తన పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేశాడు.
ఒక వ్యక్తి, "మీరు చివరకు ఆఫీస్ కి వెళ్లినప్పుడు మీ యజమాని ఆశ్చర్యపోయాడా?" అని అడిగాడు.
ఒక వ్యక్తి సమాధానమిస్తూ, "జాన్ యజమాని చాలా మంచివాడు, అతడి ఇన్సూరెన్స్‌ను కొనసాగించి, ఒక సంవత్సరం పూర్తిగా చెల్లించాడు" అని వెల్లడించాడు.
అలాగే, అతని కొందరు బాస్‌లు, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కూడా తరచూ అతన్ని చూడటానికి వచ్చేవారని చెప్పారు.
జాన్ యజమానులు అతని బట్టలు ఇంటికి తీసుకెళ్లి ఉతికేవారని కూడా ఒక నర్సు చెప్పింది.
"ఆ సమయంలో జాన్‌కు వారు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇప్పటికీ వారు అతనికి అతిపెద్ద మద్దతుదారులు." అని ఆమె చెప్పింది.
ప్రస్తుతం ఇతడి స్టోరీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది.