కెనడియన్ భార్యతో భారతదేశానికి షిఫ్ట్ అయిన యూఎస్ వ్యక్తి.. చివరికి..?
TeluguStop.com
మన భారతీయులు విదేశాల్లోకి వెళ్లి స్థిరపడుతుంటే విదేశీయులు మాత్రం ఇండియాకి వచ్చి స్థిరపడుతున్నారు.
విదేశాల్లో చాలా లోన్లీగా అనిపిస్తుందని, ఇండియాలో మాత్రం అసలైన జీవితాన్ని ఆస్వాదించడం సాధ్యమవుతుందని ఇప్పటికే ఇక్కడ స్థిరపడ్డ చాలామంది ఫారినర్స్ చెప్పి ఆశ్చర్యపరిచారు.
టిమ్ ఫిషర్( Tim Fischer ) కూడా అలాంటి వ్యక్తులలో ఒకరు.ఈ అమెరికన్ వ్యక్తి తన కనెడియన్ భార్యతో కలిసి భారతదేశంలో( India ) సెటిల్ అయ్యాడు.
ఇక్కడ తన జీవితం ఎలా మారిపోయిందో చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఆ వీడియో చాలా మందికి నచ్చింది.ఆ వీడియోలో, అమెరికా నుంచి భారత్‌కు వచ్చాక తన జీవితంలో వచ్చిన 8 మార్పుల గురించి చెప్పారు.
ఉదాహరణకి, అమెరికాలో తినే ఆహారం కంటే భారతీయ ఆహారం( Indian Food ) చాలా రుచికరంగా ఉంటుందని, ఇక్కడ ఇంటి ముందు గడ్డి కత్తిరించే పని లేదని అన్నాడు.
"""/" /
టిమ్ ఫిషర్ భారతదేశానికి వచ్చాక ఇక్కడి ప్రజలు తనని పిలవడం చాలా విచిత్రంగా ఉందని చెప్పాడు.
అతన్ని 'అంకుల్', 'సర్', 'బేటా', 'భయ్యా', 'సుణో' అని పిలుస్తారట.అంతేకాకుండా, ఇప్పుడు హిందీలో పుస్తకాలు చదవగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను అని చెప్పాడు.
అమెరికాలో( America ) కారు ఎడమ వైపు నడిపితే, భారతదేశంలో కుడి వైపు నడపాలి అని చెప్పాడు.
తన పిల్లలతో కలిసి సైకిల్ తొక్కేటప్పుడు, "నా సైకిల్‌పై ఇంకా ఎక్కువ మందిని కూర్చోబెట్టగలను" అని కూడా చెప్పాడు.
"""/" /
టిమ్ ఫిషర్ తన కెనడియన్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి భారతదేశంలో నివసిస్తున్నారు.
ఆయన అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌లోని పైక్స్ పీక్ స్టేట్ కాలేజీలో అసోసియేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీని, కొలరాడో యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశాడు.
తన సొంత వ్యాపారం ప్రారంభించక ముందు వివిధ కంపెనీలలో పనిచేశాడు.టిమ్ ఫిషర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
దాన్ని 1500 మందికి పైగా లైక్ చేశారు.చాలా మంది ఆయన వీడియో గురించి తమ అభిప్రాయాలను కామెంట్‌లలో పోస్ట్ చేశారు.
ఒకరు, "ఆధార్ కార్డ్ లోడింగ్ సూన్" అని సరదాగా కామెంట్ చేశారు.మరొకరు, "సైకిల్ మీద ఎక్కువ మంది పిల్లలను కూర్చోబెట్టడం చాలా ఫన్‌గా ఉంది" అన్నారు.
మరొకరు, "వీడియో చాలా బాగుంది! మీ ఇద్దరి వీడియోలు నాకు చాలా ఇష్టం!" అని కామెంట్ చేశారు.
నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తుందా.. ఇలా చేశారంటే దెబ్బకు పరార్!