న్యూయార్క్ : తమిళంలో ఫుడ్ ఆర్డర్ చేసిన అమెరికన్ పౌరుడు... ఈయనను చూసి ఎంతో నేర్చుకోవాలి
TeluguStop.com
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.
అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.
మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.
తాజాగా అమెరికాకి చెందిన ఓ యూట్యూబర్ న్యూయార్క్ నగరంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి తమిళంలో ఫుడ్ ఆర్డర్ చేసి అక్కడి స్టాఫ్‌కి షాకిచ్చాడు.
వివరాల్లోకి వెళితే అరీహ్ స్మిత్ అనే వ్యక్తికిక్జియోమానిక్పేరుతో యూట్యూబ్ ఛానెల్ వుంది.అయితే అతనికి దక్షిణ భారతదేశానికి చెందిన తమిళ భాష అంటే ఎంతో ఇష్టం.
ప్రపంచంలోనే తమిళం పురాతన భాష అని తెలుసుకున్న స్మిత్.పట్టుబట్టి తమిళ భాషను మాట్లాడడం నేర్చుకున్నాడు.
అంతేకాదు.న్యూయార్క్ నగరంలోని తమిళ షాపులు, హోటళ్లను వెతుక్కుంటూ వచ్చి, అక్కడ తమిళంలోనే ఫుడ్ ఆర్డర్ ఇస్తుంటాడు.
దీనికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో పెడితే లెక్కలేనన్ని వ్యూస్ .తాజాగా అతడు తమిళంలో మాట్లాడుతూ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంతో ఓ దుకాణ యజమాని మురిసిపోయాడు.
అంతేకాదు అతను కొనుగోలు చేసిన ఆహారానికి గాను స్మిత్ వద్ద బిల్లు కూడా తీసుకోలేదు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది చూసిన భారతీయ నెటిజన్లు ముఖ్యంగా తమిళులు స్మిత్‌ను ప్రశంసిస్తున్నారు.
విదేశీయుడైనా ఒక భారతీయ భాషను నేర్చుకున్న అతనిని చూసి భారతీయులు ఎంతో నేర్చుకోవాలని పలువురు కామెంట్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ కియారా రెమ్యూనరేషన్ లీక్ చేసిన నటుడు ఎస్ జె సూర్య?