Greencard Backlogs : గ్రీన్‌కార్డ్ బ్యాక్‌ల్యాగ్‌లను పరిష్కరించండి .. ఇమ్మిగ్రేషన్ సమ్మిట్‌లో యూఎస్ చట్టసభ సభ్యులు

గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ను తక్షణమే పరిష్కరించాలని ఇమ్మిగ్రేషన్ సమ్మిట్‌లో డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు సంయుక్తంగా పిలుపునిచ్చారు.

ఈ సమస్య భారతీయ నిపుణులకు పెద్ద తలనొప్పిగా మారింది.‘‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా( Foundation For India And Indian Diaspora ) (ఎఫ్‌ఐఐడీఎస్) ఆధ్వర్యంలో సోమవారం యూఎస్ క్యాపిటల్‌లో జరిగిన మొట్టమొదటి ‘‘టెక్ ఇమ్మిగ్రేషన్ సమ్మిట్’’( Tech Immigration Summit )లో పాల్గొన్న చట్టసభ సభ్యులు పలు అంశాలపై చర్చించారు.

దీనిలో భాగంగా గ్రీన్ కార్డులను జారీ చేసే విషయంలో ఏడు శాతం కంట్రీ క్యాప్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో భారతీయ వలసదారుల గ్రీన్‌కార్డ్ వెయిటింగ్ పీరియడ్ 20 నుంచి 70 ఏళ్లకు పైనే వుంటుందని వారు గుర్తుచేశారు.

కాంగ్రెషనల్ ఇండియ కాకస్ కో చైర్‌గా వున్న భారత సంతతి నేత, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా( Ro Khanna ) మాట్లాడుతూ.

హేతుబద్ధమైన ఇమ్మిగ్రేషన్ విధానానికి పిలుపునిచ్చారు.వలసదారులు సిలికాన్ వ్యాలీని నిర్మించడంలో సహాయం చేశారని.

వీరు ఎన్నో కంపెనీలు ప్రారంభించి, ఎంతోమందికి ఉద్యోగాలను సృష్టించారని ఖన్నా పేర్కొన్నారు.భారత్, చైనా, ఆసియా, మధ్యప్రాచ్యం , యూరప్ నుంచి వలస వచ్చిన వారిచే అవి స్థాపించబడ్డాయన్నారు.

ఈగిల్ యాక్ట్‌కు కో స్పాన్సర్‌గా, లీడ్‌గా వున్న రో ఖన్నా.కంట్రీ క్యాప్‌లను తొలగిస్తామన్నారు.

కాంగ్రెస్‌మెన్ ఎరిక్ స్వాల్‌వెల్ , శ్రీ థానేదర్‌లు ( Eric Swalwell, Mr.

Thanether )కూడా గ్రీన్‌కార్డ్ జారీ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు. """/" / కాగా.

గతేడాది నవంబర్‌లో సెనేటర్ క్రామెర్, జాన్ హికెన్‌లూపర్‌లు లీగల్ ఎంప్లాయ్‌మెంట్ కోసం ప్రవేశపెట్టిన .

గ్రీన్‌కార్డులకు సమానమైన యాక్సెస్ (EAGLE) చట్టం ద్వారా అమెరికన్ యజమానులు .వలసదారులను వారి జన్మస్థలం కాకుండా , ప్రతిభ ఆధారంగా నియమించుకోవడంపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది.

అంతేకాదు.ఈ చట్టం ఉపాధి ఆధారిత వలస వీసాలపై ప్రతి దేశంపై అమెరికా విధించిన ఏడు శాతం పరిమితిని తొలగిస్తుంది.

అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలపై దేశానికి ఏడు శాతంగా వున్న పరిమితిని 15 శాతానికి పెంచుతుంది.

"""/" / EAGLE చట్టం.సుదీర్ఘంగా వేచి వున్న వారికి బ్యాక్‌లాగ్‌ను సులభతరం చేస్తుందని సెనేటర్ క్రామెర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

ఈ బిల్లు వ్యవస్థను మరింత మెరిట్ ఆధారితంగా చేస్తుంది.ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల కేటాయింపును తొలుత వచ్చిన వారికి తొలుత అనే నిబంధనగా మారుస్తుంది .

అయితే గ్రీన్‌కార్డుల కోసం నిరీక్షించని దేశాలకు చెందిన విదేశీ పౌరులపై దీని వల్ల అస్సలు భారం పడదని ఇమ్మిగ్రేషన్ వాయిస్‌కు చెందిన అమన్ కపూర్ అన్నారు.

బిల్లుకు నాయకత్వం వహించి, కాంగ్రెస్‌లో వేగంగా ఆమోదించాలని కోరినందుకు సెనేటర్ క్రామెర్, సెనేటర్ హికెన్‌లూపర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు..!!