చైనీస్ ఈవీలను నిషేధించండి : జో బైడెన్‌కు యూఎస్ చట్టసభ సభ్యుడి విజ్ఞప్తి
TeluguStop.com
అమెరికా ఆటోమొబైల్ మార్కెట్ నుంచి చైనా కంపెనీలు( China Companies ) తయారు చేసిన అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను( Electric Vehicles ) పూర్తిగా నిషేధించాలని సెనేట్ బ్యాంకింగ్ కమిటీ చైర్.
అధ్యక్షుడు జో బైడెన్‌ను( President Joe Biden ) కోరారు.చైనా వాహనాలు అమెరికా ఆటో పరిశ్రమ అస్తత్వానికి ముప్పుగా ఆయన హెచ్చరించారు.
ఈ మేరకు డెమొక్రాట్ సెనేటర్ షెర్రోడ్ బ్రౌన్( Senator Sherrod Brown ) గురువారం బైడెన్‌కు లేఖ రాశారు.
ధైర్యంగా, దూకుడుగా వ్యవహరించి చైనా కంపెనీలు ఉత్పత్తి చేసే ఈవీలను శాశ్వతంగా నిషేధించాలని ఆయన కోరారు.
అలాగే వాటి మూలాలను దాచడానికి వారు స్థాపించే ఏవైనా అనుబంధ సంస్థలను శాశ్వతంగా నిషేధించాలని బ్రౌన్ విజ్ఞప్తి చేశారు.
"""/" /
మిచిగాన్‌కు చెందిన బ్రౌన్.సెనేటర్లు గ్యారీ పీటర్స్, డెబ్బీ స్టాబెనోలు గత నెలలో దిగుమతి సుంకాలు పెంచాలని జో బైడెన్‌ను కోరారు.
అలాగే భద్రతాపరమైన ప్రమాదాలు, చైనా విధానాల కారణంగా చైనా ఈవీలపై( China EVs ) కఠినమైన నిషేధం విధించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
చైనీస్ తయారీదారులు తమ వాహనాలతో ఈవీ గేమ్‌కు నాయకత్వం వహిస్తున్నారు.ఈ కొత్త సాంకేతికతో కనెక్ట్ చేయబడిన కార్లు.
వారు ప్రాసెస్ చేసే డేటా కారణంగా జాతీయ భద్రతకు( National Security ) హాని కలిగించవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారరు.
చైనీస్ ఈవీ తయారీదారులు ఈవీ పన్ను క్రెడిట్‌లకు అర్హత సాధించడానికి మెక్సికోలో ఫెసిలిటీలను ఏర్పాటు చేయడంపైనా చట్టసభ సభ్యులు హెచ్చరికలు చేశారు.
"""/" /
తాము ప్రమాదాలను గుర్తించడానికి జాతీయ భద్రతకు సంబంధించిన ఏదైనా చర్యలు తీసుకోవడానికి వేగంగా ముందుకు వెళ్తున్నామని వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో గత నెలలో రాయిటర్స్‌తో అన్నారు.
అమెరికన్ కార్మికులకు ప్రతికూలంగా వుంచే విధంగా చైనా వాహనాలకు గనుక సబ్సిడీ ఇస్తుంటే దానిపై ఏదో ఒకటి చేయాలని గినా అన్నారు.
మార్చిలో చైనాపై బైడెన్ విధానాలు మా మార్కెట్‌ను దాని వాహనాలతో నింపగలవని .
మన జాతీయ భద్రతకు ప్రమాదాలను కలిగిస్తాయని గినా ఆందోళన వ్యక్తం చేశారు.చైనా ఎంబసీ నిషేధం, సుంకం పెంపుపై ఇంకా స్పందించలేదు .
అయితే చైనీస్ ఆటోమొబైల్ ఎగుమతులు చైనా తయారీ పరిశ్రమ నాణ్యత, బలమైన ఆవిష్కరణలను ప్రతిబింబిస్తాయని వారు గతంలో పేర్కొన్నారు.
అమెరికన్ ఆటో పరిశ్రమ విదేశీ ఆటో తయారీదారుల నుంచి ముప్పును ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు.
చైనీస్ ఈవీ దిగ్గజాలు తమ వాహనాలను మెరుగుపరచడంలో విస్తృతంతగా కృషి చేస్తున్నాయి.ప్రపంచస్థాయి ఉత్పత్తులతో ఈవీ స్పేస్‌లో అనేక రకాల వెరైటీలను అందిస్తున్నాయి.
అంతేకాదు.అమెరికా తన సొంత ఆటోమొబైల్ పరిశ్రమ అవసరాల కోసం చైనా నుంచి లిథియం అయాన్ బ్యాటరీలను విస్తృతంగా దిగుమతి చేసుకుంటుంది.
పూరీ జగన్నాధ్ ఇప్పటికైన తన కొడుకుతో ఒక సినిమా చేయచ్చు కదా..