డొనాల్డ్ ట్రంప్ నియామకాన్ని సమర్ధించిన రో ఖన్నా .. శ్రీరామ్ కృష్ణన్‌కు మద్ధతు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తన కేబినెట్‌ను సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే పలు కీలక పోస్ట్‌లకు నియామకాలను ఆయన పూర్తి చేశారు.జనవరి 20న తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి పూర్తి కేబినెట్‌ను రెడీ చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు.

అయితే ఆయన నియామకాలను సొంత పార్టీకి చెందిన నేతలే వ్యతిరేకిస్తున్నారు.తులసి గబ్బార్డ్, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై భారత సంతతికి చెందిన నేత, ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇప్పటికే తప్పుబట్టారు.

తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు( Artificial Intelligence ) సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా భారత సంతతి నేత శ్రీరామ్ కృష్ణన్( Sriram Krishnan ) నియామకాన్ని డెమొక్రాట్ నేత, ఇండో అమెరికన్ అయిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా( Ro Khanna ) సమర్ధించడం విశేషం.

శ్రీరామ్ నియామకంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వారికి ఖన్నా చురకలంటించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను ఆకర్షించంలో అమెరికా సామర్ధ్యాన్ని ఈ నియామకం చైనా తదితర దేశాల కంటే ముందు ఉంచుతుందని రో ఖన్నా ట్వీట్‌లో పేర్కొన్నారు.

శ్రీరామ్ అత్యున్నత స్థాయికి చేరుకుంటాడని.దాని పేరు అమెరికన్ ఎక్స్‌ప్షనలిజం అని ఆయన పేర్కొన్నారు.

"""/" / కాగా.శ్రీరాం కృష్ణన్ .

వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారని ట్రంప్ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

గతంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, యాహూ, ఫేస్‌బుక్, స్నాప్‌లలో ప్రొడక్ట్ బృందాలకు నాయకత్వం వహించిన కృష్ణన్.

వైట్‌హౌస్ ఏఐ క్రిప్టో జార్‌గా ఉండే డేవిడ్ ఓ సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తెలిపారు.

"""/" / డేవిడ్ సాక్స్‌తో సన్నిహితంగా పనిచేస్తూ.ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని కొనసాగించడంపై శ్రీరామ్ దృష్టి సారిస్తారని ట్రంప్ వెల్లడించారు.

సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్‌ సహా ప్రభుత్వంలో ఏఐ పాలసీని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్ సాయపడనున్నారు.

విండోస్ అజూర్ వ్యవస్ధాపక సభ్యుడిగా మైక్రోసాఫ్ట్‌లో శ్రీరామ్ తన కెరీర్‌ను ప్రారంభించారని ట్రంప్ తెలిపారు.

తండేల్ విషయంలో భారీ రిస్క్ తీసుకున్న నిర్మాతలు.. చైతన్య సాయిపల్లవి ఏం చేస్తారో?