కరోనా నిర్ధారణ ఇక ఐదు నిమిషాల్లోనే, అమెరికా సంస్థ సంచలనం

కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న విషయం తెలిసిందే.ఈ కరోనా మహమ్మారి తో ప్రపంచ వ్యాప్తంగా 27 వేల మందికి పైగా మృత్యువాత పడగా లక్షల్లో జనాలు ఇంకా దీనికోసం చికిత్స పొందుతూనే ఉన్నారు.

ఇంత గా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుండడం తో ప్రజలు కూడా ఆ పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడుతున్నారు.

అయితే అమెరికా కు చెందిన ఒక సంస్థ మాత్రం కేవలం ఐదు నిమిషాల్లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసే పరికరాన్ని తయారు చేసినట్లు వెల్లడించింది.

కరోనా వైరస్ గనుక ఉంటే మాత్రం కేవలం ఐదు నిమిషాల్లోనే ఫలితాన్ని చెబుతుంది అని,ఒకవేళ నెగిటివ్ గనుక ఉంటే 13 నిమిషాల్లో తెలుస్తుంది అంటూ ఆ సంస్ధ తెలిపింది.

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ పరికరాన్ని కనుగొనడానికి అనుమతి ఇచ్చింది అని కానీ పూర్తి స్థాయి ఆమోదం మాత్రం లభించలేదంటూ ఆ సంస్థ తెలిపింది.

అయితే ఈ పరికరం వల్ల మరో ప్రయోజనం ఉంది.అదేంటంటే చిన్న పరిమాణంలో ఉండడం వల్ల దీన్ని ఎక్కడైనా వినియోగించుకోనే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా హాస్పిటల్ బయటే పరీక్షలు నిర్వహించుకొనే అవకాశం ఉంటుంది అంటూ ఆ సంస్థ వెల్లడించింది.

వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దీనిని ఉపయోగానికి ఎఫ్‌డీఏతో కలిసి పనిచేస్తామని ఆ సంస్థ తెలిపింది.

మరోపక్క ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కరోనా వైరస్‌ ను జయించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తమ సంస్థ కూడా ఆ దిశగానే కృషి చేస్తుంది అని ఆ సంస్థ పేర్కొంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా లో కూడా 1000 కి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఇప్పటివరకు లక్షకు పైగా కరోనా పాజిటివ్ తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత లగ్జరీ లైఫ్.. ఆమె దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!