యూఎస్ కాంగ్రెస్ కు....అమెరికా టెక్ దిగ్గజాల ఘాటు లేఖ..!!

డ్రీమర్స్ తల్లి తండ్రులతో పాటు చిన్నతనంలోనే అమెరికా వచ్చి అక్కడే పెరిగిన యువకులను డ్రీమర్స్ అంటారు.

వీరికి ఒబామా అమెరికాలో ఉండేలా హక్కులు కల్పించారు.అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రీమర్స్ ను అమెరికా నుంచీ వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు.

కాలం చెల్లిన వాళ్ళు ఇక్కడి నుంచీ వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు.అంతేకాదు వలస వాసులకు అమెరికాలో ఎంట్రీ లేదంటూ వీసాలపై ఆంక్షలు విధించారు.

ఎప్పటికప్పుడు వలస వాసుల తరుపున న్యాయస్థానాలలో పలువురు ప్రముఖులు పోరాడారు కూడా.అయితే ఈ క్రమంలోనే ఎన్నికలు రావడం, ట్రంప్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది.

కానీ డ్రీమర్స్ విషయంలో ఒబామా కొనసాగించిన పౌరసత్వ బిల్లు ఆదేశాలు ట్రంప్ రద్దు చేయడంతో ఇప్పుడు వారందరికీ గడువు తీరిపోయే పరిస్థితి ఏర్పండి.

దాంతో డ్రీమర్స్ అందరూ నూతన అధ్యక్షుడు బిడెన్ కు ఒబామా కొనసాగించిన బిల్లును అమలు చేయాలని,ట్రంప్ ఉత్తరువులను నిలిపివేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

అయితే గడువు ముంచుకొస్తున్న సమయంలో బిడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో టెక్ దిగ్గజ సంస్థలు అన్నీ డ్రీమర్స్ కు అండగా నిలుస్తున్నాయి.

"""/"/ అమెరికా వ్యాప్తంగా ఉన్న సుమారు 90 బడా టెక్ సంస్థల సిఈవో లు అందరూ కలిసి అమెరికా కాంగ్రెస్ కు లేఖలు రాశాయి.

అమెరికాలో డ్రీమర్స్ గా ఉన్న యువకులు అందరికి అమెరికా పౌరసత్వం వచ్చేలా చట్టం తీసుకురావాలని అమెరికా కాంగ్రెస్ ను కోరారు.

డ్రీమర్స్ గా ఉన్న ఎంతో మంది యువకులు తమ కంపెనీలలలో అత్యంత ప్రతిభావంతులుగా ఉన్నారని, వారి సేవలు తమ కంపెనీలకు అలాగే అమెరికాకు ఎంతో అవసరమని వారి ప్రతిభ అమెరికా ఆర్ధిక స్థితికి ఎంతగానో ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ కు లేఖలు రాసిన వారిలో గూగుల్ సిఈవో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది.

పొట్ట కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!