అమెరికాలో రోడ్డు ప్రమాదం .. తెలుగు విద్యార్ధి దుర్మరణం

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.

మృతుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీలం అచ్యుత్‌గా( Belam Achyut ) గుర్తించారు.న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో( State University Of New York ) ఎంఎస్ చదువుకుంటున్న అతను బుధవారం సాయంత్రం ప్రమాదానికి గురై , ప్రాణాలు కోల్పోయినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

అచ్యుత్ అకాల మరణం బాధించిందని, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

అతని కుటుంబ సభ్యులు, స్థానిక ఏజెన్సీలతో టచ్‌లో ఉన్నామని .అచ్యుత్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు అండగా ఉంటామని కాన్సులేట్ కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

"""/" / ఇకపోతే అమెరికాలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు.

సౌత్ కరోలినా రాష్ట్రంలోని గ్రీన్‌విల్లె కౌంటీలో( Greenville County ) ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మృతులను గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్‌లుగా గుర్తించారు.

వీరు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ అతివేగంగా వంతెనపైకి దూసుకెళ్లింది.అనంతరం 20 అడుగుల గాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొడుతూ చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది.

"""/" / అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.వీరు ప్రయాణించిన కారు చెట్టులో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జు అయ్యింది.

కారులో వున్న డిటెక్షన్ సిస్టమ్ ద్వారా .ప్రమాదానికి సంబంధించిన సమాచారం బాధిత మహిళల కుటుంబ సభ్యులకు వెళ్లింది.

దీంతో వారు వెంటనే సౌత్ కరోలినా పోలీసులను అలర్ట్ చేశారు.హుటాహుటిన రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ రెస్పాన్సీ టీమ్, సౌత్ కరోలినా హైవే పెట్రోల్ ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్ , ఈఎంఎస్ యూనిట్స్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో నలుగురు వున్నట్లుగా తెలుస్తోంది.ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా .

నాలుగో వ్యక్తిని అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ఈ చిన్న టిప్ ను ఫాలో అయ్యారంటే హెయిర్ ఫాల్ మీ వంక కూడా చూడదు!