ఇమ్మిగ్రేషన్ ఫీజుల పెంపు.. విదేశీయులకు ఫెడరల్ కోర్టులో ఊరట
TeluguStop.com
అమెరికాలో స్థిరపడిన, స్థిరపడాలని భావిస్తున్న విదేశీయులకు ఆ దేశ కోర్టు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
భారీగా పెంచిన పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ ఫీజులను నిలిపివేస్తూ యుఎస్ జిల్లా జడ్జి జఫ్రీ వైట్ ఆదేశాలు జారీ చేశారు.
8 స్వచ్ఛంద సంస్థలు, ఇమ్మిగ్రెంట్ లీగల్ రీసోర్స్ సెంటర్‌లు ఉమ్మడిగా పెంచిన ఫీజులను వ్యతిరేకిస్తూ కోర్టుని ఆశ్రయించాయి.
పెంచిన ఫీజులను, చట్ట విరుద్ధంగా నియమితులైన అధికారులు నిర్ణయించారని వీటిని తక్షణం నిలిపివేయాలని ఈ సంస్థలు తమ పిటిషన్‌లో ప్రస్తావించాయి.
ఆయన నిర్ణయంతో రేపటి నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు నిలిచిపోయాయి.ఇద్దరుh3 Class=subheader-style సీనియర్ హోంసెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అధికారులు/h3p మెక్ అలీనన్, చాద్‌వూల్ఫ్‌లను చట్టవిరుద్ధంగా నియమించారని న్యాయమూర్తి వైట్ అభిప్రాయపడ్డారు.
ఫెడరల్ నియమం ప్రకారం ఈ ఫీజులను ఎందుకు పెంచారో వివరించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఫీజుల పెంపును అడ్డుకున్నానని ఆయన పేర్కొన్నారు.
కాగా గ్రీన్‌కార్డులకు, పౌరసత్వ హక్కులకు తాత్కాలిక వర్క్ పర్మిట్‌లకు ఫీజులను పెంచాలని యూఎస్‌సీఐఎస్ ప్రతిపాదించింది.
దీనిలో భాగంగా హెచ్1 బి వీసా ఫీజు ప్రస్తుతం ఉన్న 460 డాలర్ల నుంచి 555 డాలర్లకు పెంచారు.
ఎల్ 1 వీసాల ఫీజులను 75 శాతం పెంచి, 805 డాలర్లుగా నిర్ణయించారు.
ఇప్పటికే పని చేస్తోన్న హెచ్1బి కార్మికుల భాగస్వాములకు ఫీజుని 34 శాతం పెంచి, 550 డాలర్లు వర్క్ పర్మిట్ ఫీజుగా నిర్ణయించారు.
పౌరసత్వ ఫీజుని 83 శాతం పెంచి, 640 డాలర్ల నుంచి 1170 డాలర్లుగా నిర్ణయించారు.
ఈ కొత్త నిబంధనలను రూపొందించిన అధికారి చాద్‌వూల్ఫ్‌ని పాలసీ విభాగంలో ఉన్నతాధికారిగా ట్రంప్ నియమించినప్పటికీ, ఈ నియామకాన్ని సెనేట్ అంగీకరించలేదు.
పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుంటే చాలు ఆక్సిజన్ లభిస్తుంది: చంద్ర బోస్