అమెరికా : ముగిసిన హెచ్ 1 బీ వీసాల దరఖాస్తు ప్రక్రియ.. మరి మిగిలిన వాటి పరిస్ధితేంటీ..?

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసాల( H1B Visa ) కోసం నిర్దేశిత పరిమితికి తగ్గ దరఖాస్తులు అందాయని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)( USCIS ) ప్రకటించింది.

హెచ్ 1 బీ వీసాలు మంజూరుకానీ వారికి మరికొన్ని రోజుల్లో ఆన్‌లైన్‌లో సమాచారం అందిస్తామని వెల్లడించింది.

ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌లు కలిగిన పిటిషనర్లు 2024 ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్‌లను దాఖలు చేయవచ్చని వెల్లడించింది.

యూఎస్ కాంగ్రెస్ హెచ్ 1 బీ కేటగిరీకి ప్రస్తుతం వార్షిక రెగ్యులర్ క్యాప్‌ను 65000గా నిర్ణయించింది.

ఇందులో 6800 వీసాలు యూఎస్ - చిలీ, యూఎస్- సింగపూర్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేసే చట్టపరమైన నిబంధనల ప్రకారం పక్కనపెట్టారు.

ఒకవేళ ఇందులో ఏవైనా వీసాలు మిగిలిపోతే వాటిని వచ్చే ఆర్ధిక సంవత్సరం రెగ్యులర్ హెచ్ 1 బీ క్యాప్ కోసం అందుబాటులోకి తీసుకొస్తారు.

అయితే కామన్‌వెల్త్ ఆఫ్ నార్తర్న్ మరియానా ఐలాండ్స్ (సీఎన్ఎంఐ), గ్వామ్‌‌లోని హెచ్ 1 బీ కార్మికులు 2008 నుంచి డిసెంబర్ 2029 వరకు కన్సాలిడేటెడ్ నేచురల్ రిసోర్సెస్ యాక్ట్ ద్వారా సెట్ చేయబడిన మార్గదర్శాలను అనుసరించి క్యాప్‌ నుంచి మినహాయించవచ్చు.

"""/" / నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.

ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.

వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ ( STEM ) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట. """/" / ఇకపోతే.

హెచ్ 1 బీ వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరింత సులభతరం చేసేందుకు గాను చర్యలు చేపట్టింది.

దీనిలో భాగంగా కొన్ని కేటగిరీలకు చెందిన హెచ్ 1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునేలా ప్రయోగాత్మకంగా ఓ ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు.

ఈ మేరకు వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ జూలీ స్టఫ్( Julie Stufft ) వెల్లడించారు.

దీని ప్రకారం తొలుత 20 వేల మందికి వీసా రెన్యువల్ చేయనున్నారు.మూడు నెలల పాటు ఈ పైలట్ ప్రోగ్రామ్ అందుబాటులో వుంటుందని జూలీ తెలిపారు.

భారతీయుల నుంచే అమెరికా వీసాలకు ఎక్కువ డిమాండ్ వుందని.అందువల్ల వారికి వీలైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని జూలీ స్టఫ్ చెప్పారు.

ఈ వీడియో చూస్తే.. మీ కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం..