కరోనా రోగులకు సేవ చేసి మహమ్మారికి బలి: కంటతడి పెట్టిస్తున్న చివరి మెసేజ్

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్సే.ఈ మహమ్మారి ధాటికి ప్రపంచం వణికిపోతోంది.

ఆర్ధికంగా, సైనికంగా, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిన అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఈ సూక్ష్మజీవితో జరుగుతున్న యుద్ధంలో ఓటమి పాలవుతున్నాయి.

ఇలాంటి కఠిన పరిస్ధితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి మరీ పోరాడుతున్నారు వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బంది.

ఆరోగ్యవంతమైన దేశం కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్నారు.ఇప్పటికే పలువురు మెడికల్ సిబ్బందికి వైరస్ సోకి ప్రాణాలను సైతం కోల్పోయారు.

తాజాగా అమెరికాలో జరిగిన ఒక ఉదంతం ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది.61 ఏళ్ల మాధ్వీ అయా ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఆమె పలువురికి వైద్య సహాయం అందిస్తోంది.ఈ క్రమంలో మాధ్వీ కూడా కరోనా బారినపడ్డారు.

ఆమెను మార్చి 18న లాంగ్ ఐలాండ్ జ్యూయిష్ మెడికల్ సెంటర్‌లో చేరి అక్కడ చికిత్స పొందుతూ 11 రోజుల తర్వాత మరణించారు.

అయితే ఆమె ఇంకా న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని వుడ్‌హాల్ హాస్పిటల్‌‌‌లోని ఐసీయూలో చికిత్స పొందుతోందని మాధ్వీ కుటుంబం భావించింది.

"""/"/ సర్జికల్ మాస్క్ వేసుకుని కరోనా సోకిన రోగులకు చికిత్స చేశానని ఆమె తన భర్త మరియు కుమార్తెతో చెప్పింది.

కరోనా నిర్థారణ లేదా లక్షణాలు కనిపించిన అనంతరం మరణించినట్లుగా రాయిటర్స్ సంస్థ గుర్తించిన 51 మంది అమెరికన్ ఆరోగ్య కార్యకర్తలలో మాధ్వీ కూడా ఉన్నారు.

యూఎస్ హెల్త్ కేర్ వర్కర్స్‌‌లో మరణించిన వారి గురించిన అధికారిక లెక్కలు లేవు.

మరోవైపు మాధ్వీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ‘‘త్వరలో ఇంటికి వస్తానని.ఐ లవ్ యూ అంటూ 18 ఏళ్ల కుమార్తెకి మెసేజ్ పెట్టింది.

అయితే ఆ లోపే ఆమె మరణించడం దిగ్భ్రాంతికరం.1993లో మాధ్వీ తన కుటుంబంతో కలిసి భారత్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లింది.

తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొని, విధులకు హాజరయ్యేందుకు వెళ్లేముందు కుమార్తె నుదిటిపై ముద్దు పెట్టుకునేది.

దేవర సక్సెస్ క్రెడిట్ ఎన్టీఆర్ కే దక్కుతుందా.. ఈ రేంజ్ లో ఎవరూ యాక్ట్ చేయలేరంటూ?