గ్రీన్‌కార్డే అంతిమ లక్ష్యం.. చిక్కుల్లో పడుతున్న భారతీయులు
TeluguStop.com
మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికాకు( America ) వస్తున్న చాలా మంది వలసదారులకు గ్రీన్‌కార్డ్( Green Card ) అనేది అంతిమ లక్ష్యం.
అయితే ఇది ఇప్పుడున్న పరిస్ధితుల్లో చాలా కష్టం.అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న కంట్రీ క్యాప్ నిబంధన కారణంగా భారతీయులకు గ్రీన్‌కార్డ్ రావాలంటే దశాబ్ధాల పాటు నిరీక్షించాలి.
ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డ్ పొందటానికి కొందరు అక్రమ మార్గాలను అన్వేషిస్తూ ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు.
అందులో ఒకటి మ్యారేజ్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్( Marriage Based Immigration ) సిస్టమ్.
గ్రీన్ కార్డ్ ఉన్న జీవిత భాగస్వామి ఉంటే వారి ద్వారా శాశ్వత నివాస హోదాను వేగంగా పొందవచ్చని కొందరు కలలు గంటూ మోసాలకు గురవుతున్నారు.
అయితే యూఎస్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సక్రమంగా అనుసరించి కొందరు ఈ వ్యవస్ధను సక్రమంగా వినియోగించుకుంటున్నారు.
"""/" /
కాగా.2023 సెప్టెంబర్ నాటికి అమెరికాలో భారతీయ వృత్తి నిపుణుల గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్స్ దాదాపు 18 లక్షలు దాటింది.
వీటిలోని 10.7 లక్షల దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు సుమారు 134 ఏళ్లు పడుతుందని ఓ అధ్యయనం చెబుతోంది.
ప్రతి యేటా అగ్రరాజ్యం దాదాపు 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తుంది.పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఒక్కో దేశంపై అమెరికా 7 శాతం కంట్రీ క్యాప్ నిబంధనను అమలు చేస్తుంది.
ఈ లెక్కన గ్రీన్‌కార్డ్ కోసం జీవితం కాలం ఎదురుచూడాల్సిన పరిస్ధితి నెలకొంది. """/" /
ఇక అమెరికాలో హెచ్–1బీ,( H1-B ) ఇతర దీర్ఘకాలిక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు.
ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు.
అప్పుడు వారు అగ్రరాజ్యాన్ని వదిలి స్వదేశాలకు వెళ్లాల్సి వుంటుంది.ఇలాంటి వారు అమెరికాలో దాదాపు 2,50,000 మంది వరకు వుంటారని అంచనా.
భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా ‘గ్రీన్ కార్డు’ కోసం నిరీక్షిస్తున్నారు.ఈ సమయంలో వారి పిల్లల వయసు 21 ఏళ్లు దాటుతోంది.
దీంతో అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.డ్రీమర్లు 21 ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్‌లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు.
21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్ హోదా పోతుంది.వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి చిన్నారులుగా అగ్రరాజ్యం వచ్చిన భారతీయులే ఉన్నారు.
10 నిమిషాల ప్రయాణానికి రూ. 2800 ఛార్జ్ .. ఎన్ఆర్ఐ ఫిర్యాదుతో వెలుగులోకి , ట్యాక్సీవాలా అరెస్ట్